బాలయ్య 'సింహా' దెబ్బతో 'ప్రస్థానం' ఆగిందా?
శర్వానంద్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన “ప్రస్థానం" చిత్రం బాలయ్య “సింహా" దెబ్బతో ఒక్కసారిగా అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియాలోకి వెళ్లిపోయిందని తెలుస్తోంది. అంతకుముందు వారమే రిలీజైన ప్రభాస్ “డార్లింగ్" కి చోటు ఇవ్వటానికి కొన్ని ధియోటర్స్ నుంచి ఖాళీ చేస్తే ఇప్పుడు మెయిన్ ధియోటర్స్ నుంచి కూడా తప్పుకుంటోందని సమాచారం. దాంతో ఇప్పుడిప్పుడే మౌత్ టాక్ తో యావరేజ్ రేంజి అనిపించుకుంటున్న ఆ చిత్రంకి పెద్ద ఇబ్బందే వచ్చిపడింది. ఇక ఈ చిత్రం రిలీజైన రెండో రోజే ప్రస్ధానం చిత్రంలో నాలుగు పాటలు తొలిగించారు. దాంతో ఇరవై నిముషాల సేపు ట్రిమ్మింగ్ జరిగినట్లు అయింది. పాటలు కథనానికి అడ్డంగా మారినట్లు చూసిన వారు ఫీలవటంతో వాటిని తొలిగిస్తున్నామని చెప్పారు. వెన్నెల చిత్రం అనంతరం లాంగ్ గ్యాప్ తో దర్శకుడు దేవకట్టా ఈ చిత్రాన్ని రూపొందించారు. పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం సాగుతుంది. శర్వానంద్ ఎప్పటికన్నా మంచి నటన చూపాడని, సాయికుమార్ కెరీర్ లో ఓ ల్యాండ్ మార్క్ చిత్రంగా మారుతుందని అంతా భావించారు. అయితే ఇలా ధియోటర్లలో లేకుండాపోవటమే విషాదమని అంటున్నారు.


Click it and Unblock the Notifications











