Don't Miss!
- Sports ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- News సాగర్ టెయిల్ పాండ్ నుండి ఏపీ నీటిచౌర్యం; ఎన్నికలవేళ మళ్ళీ కృష్ణా జలవివాదం!!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
బాలయ్య 'సింహా' కి సంక్రాంతి రిలీజ్ కలిసివస్తుందా?
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రెడీ అవుతున్న 'సింహా' చిత్రం సంక్రాతికి రాబోతోందని..'సింహా' ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బి.మహేంద్రబాబు మీడియాకు తెలియజేశారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా హైద్రాబాద్ లో జరుగుతోందనీ, ఈ నెలాఖరు వరకూ ఇక్కడే షూటింగ్ జరిపి ఆ తర్వాత వైజాగ్ లో కొంత షూటింగ్ చేస్తామని మహేంద్రబాబు తెలిపారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. అలాగే బాలకృష్ణ, స్నేహ ఉల్లాల్, నమిత హీరోహీరోయిన్లుగా ఈ 'సింహా' చిత్రం తెరకెక్కుతోంది. 'భద్ర', 'తులసి' వంటి హిట్ చిత్రాలను అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రంలోని ఇతర పాత్రల్లో రఘు, కోట శ్రీనివాసరావు, ఆదిత్య మీనన్, కె.ఆర్.విజయ, బ్రహ్మానందం, వేణుమాధవ్, ఆలీ, ధర్మవరపు, కృష్ణ భగవాన్, ఎల్బీ శ్రీరామ్, సైరాబాను, మలయాళ విలన్ సాయికుమార్ తదితరులు నటిస్తున్నారు. కథ-స్క్రీన్ ప్లే-మాటలు సైతం బోయపాటి శీను అందిస్తున్న ఈ చిత్రానికి స్టన్ శివ ఫైట్స్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, చక్రి సంగీతం అందిస్తున్నారు. ఇక బాలకృష్ణ, వైవియస్ చౌదరి ల కాంబినేషన్లో గతంలో వచ్చిన ఒక్క మగాడు చిత్రం కూడా సంక్రాంతికే రిలీజైంది. అయితే అది ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. దాంతో బాలయ్య అభిమానులు ఈ సంక్రాంతి రిలీజ్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే చిత్రంలో విషయం ఉంటే ఈ ప్లాఫ్ సెంటిమెంట్ అనేది ఉండదనేది ఎన్నో సినిమాలుగా ఇండస్ట్రీలో నిరూపితమవుతున్న సత్యం.