డాన్ గా మారే కథే బాలయ్య 'సింహా'
బాలకృష్ణ తాజా చిత్రం సింహా ఈ రోజు అంతటా రిలీజవుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బాలకృష్ణ పాత్ర పేరు నరసింహ. అతనంటే అందరికీ అభిమానం, ప్రేమ. ఆయన కూడా అందరూ నావాళ్లే అనుకొనే మనిషి. తన కుటుంబ సభ్యులందర్నీ కంటికి రెప్పలా చూసుకొంటాడు. అలాంటి నరసింహ ఓ దశలో డాన్ గా మారాల్సి వస్తుంది. ఎందుకు అలా మారాల్సి వస్తుందనేది తెర మీదే చూడాలి. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రలలో కనిపించనున్నారు. నయనతార, నమిత, స్నేహా ఉల్లాల్ ఆయన సరసన కనిపించనున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. 'భద్ర', 'తులసి' తరవాత దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందించిన చిత్రమిది.
బాలకృష్ణ సింహా బోయపాటి శ్రీను నయనతార నమిత స్నేహా ఉల్లాల్ balakrishna simha nayantara namitha sneha ullal


Click it and Unblock the Notifications