‘సింహా’ వస్తూంటే అంతా తప్పుకోవాల్సిందే..ఎన్టీఆర్
'సింహా" సినిమా వస్తుంటే మిగిలిన సినిమాలు పక్కకు తప్పుకోవాలి లేదంటే ఆ చిత్రాలకు వాళ్ళు అనుకున్న ఫలితం దక్కదు. బాలయ్య బాబాయ్ కెరీర్‌లో మరో సూపర్‌డూపర్ హిట్‌గా ఈ చిత్రం నిలుస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు ఎన్టీఆర్. ఆయన హైటెక్ సిటీలోని రాక్ గార్డెన్స్‌లో జరిగిన 'సింహా" విజయోత్సవ వేడుకకు హాజరై ప్రశంసించారు.
ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ -"'సింహా" అనేది రెండక్షరాల టైటిల్ అయినప్పటికీ మీ గుండెల్లో చెదరిపోని ముద్ర వేసే సినిమా అవుతుంది. రికార్డులను వేటాడడానికి వస్తున్న 'సింహా"లో బోయపాటి శ్రీను నన్ను రెండు వైవిధ్యమైన పాత్రలలో చూపే ప్రయత్నం చేశారు. సమాజానికి పనికివచ్చే ఓ సందేశం కూడా ఇందులో ఇమిడేలా రూపొందించారు దర్శకుడు. చక్రి ఆణిముత్యాల్లాంటి ఆరు పాటలను అందించారు. అవి ఆదరణ పొందడం ఆనందంగా ఉంది" అన్నారు.
ఇక గెస్ట్ గా హాజరైన దాసరి నారాయణ రావు మాట్లాడుతూ -"82 సంవత్సరాల వయసు తెలుగు సినిమా పరిశ్రమది అయితే అందులో 60 సంవత్సరాల వయసు నందమూరి వంశానిది. అలాంటి క్రమశిక్షణ, వృత్తినిబద్దతగల వంశం నుంచి వచ్చిన బాలయ్య నటిస్తున్న 'సింహా" ఇండస్ట్రీకి కావాల్సిన ఘనవిజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను. చక్రి అందించిన ఆరు బాణీలు వినూత్నంగా ఉన్నాయి. ఈ చిత్రంలో బోయపాటి శ్రీను బాలయ్యను కొత్తగా చూపే ప్రయత్నం చేశాడు" అన్నారు.
అలాగే నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ - "పాత రికార్డులను బద్దలు కొట్టేంత మంచి వియాన్ని 'సింహా" సాధిస్తుందని ఆశిస్తున్నాను" అన్నారు. చక్రి మాట్లాడుతూ -"ఈ సినిమా కోసం 8 నెలల పాటు పరిశ్రమించి అందించిన 6 పాటలు ఆదరణ పొందడం సంతోషంగా ఉంది" అన్నారు.
యునైటెడ్ మూవీస్ పతాకంపై బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం 'సింహా" ఆడియో పంక్షన్ లేకుండా రిలీజ్ చేసారు. దాంతో విజయోత్సవాన్ని ఏర్పాటుచేసారు నిర్మాత పరుచూరి కిరీటి..ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావులు చిత్ర యూనిట్‌కు షీల్డ్‌సను బహుకరించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నయనతార, నమిత, స్నేహ వుల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. సంగీతం చక్రి అందించారు.


Click it and Unblock the Notifications











