బాలకృష్ణ నాన్ స్టాప్ ‘సింహా’
యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న భారీ చిత్రం 'సింహా". నందమూరి బాలకృష్ణ చిత్రాలైన 'సమరసింహా రెడ్డి", 'నరసింహనాయుడు", 'లక్ష్మీనరసింహా' వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాలను అందించారు. రవితేజను 'భద్ర'గా, వెంకటేష్ ను 'తులసి'గా మలచినటువంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ 'సింహా" విభిన్న శైలిలో షూటింగ్ శరవేగంగా నడుస్తున్నది. సెప్టెంబర్ 4 నుండి 19 వరకు రామోజీ ఫిలిం సిటిలో తొలి షెడ్యూల్ జరుపుకొన్న'సింహా" సోమవారం నుంచి హైద్రాబాద్ సిటిలో మరో షెడ్యూల్ జరుపుకొంటోంది. ఈ సందర్బంగా నిర్మాత పరుచూరి కిరీటి మాట్లాడుతూ హీరో నందమూరి బాలకృష్ణ గారి ఇంట్రడక్షన్ పైట్ ని బాలకృష్ణ, స్నేహఉల్లాల్ కాంబినేషన్ సీన్స్ ని చిత్రీకరించామన్నారు మరో ప్రధాన పాత్రలో కాథానాయిక నమిత నటించనుంది. ఈ నెల 21 నుండి హైదరాబాద్ సిటిలో షెడ్యూల్ ప్రారంభమై నవంబర్ చివర వరకు నాన్ స్టాప్ గా ఈ షెడ్యూల్ జరుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ బి. మహేంద్రబాబు మాట్లాడుతూ డిసెంబర్ లో వైజాగ్ లో జరిగే షెడ్యూల్ తో చిత్రం పూర్తవుతుందని సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చెయూటకు సన్నాహాలు సిద్దం చేస్తున్నామని చెప్పారు. ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో రఘు, కోటశ్రీనివాసరావు, అదిత్యమీనన్, బ్రహ్మానందం, వేణుమాధవ్, ఆలీ, ధర్మవరపు, ప్రముఖ మళయాల విలన్ సాయికుమార్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు చక్రి తొలిసారిగా బాలకృష్ణ సినిమాకు స్వరాలందిండం విశేషం.


Click it and Unblock the Notifications











