బాలకృష్ణ 'సింహా' రిలీజ్ డేట్ కన్ఫర్మ్...
ఓ పాటలో కొద్ది భాగం మినహా 'సింహా' షూటింగ్ పూర్తయింది. మిగతా పనులన్నీ పూర్తిచేసి ఈ నెల(ఏప్రియల్) 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం అంటూ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసారు..నిర్మాత పరుచూరి కిరీటి. ఆయన మీడియాని కలసి ఈ విషయాలు చెప్పుకొచ్చారు. అలాగే బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి చిత్రం ఆశిస్తున్నారో అలాంటి చిత్రమే 'సింహా'. ఇటీవలే పాటలు విడుదల చేశాం. మంచి స్పందన వస్తోంది. అటు మాస్‌నీ, ఇటు యువతనీ ఆకట్టుకొంటున్నాయన్నారు.
దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ''పౌరుషం నిండిన పాత్రల్ని పోషించడంలో బాలకృష్ణ శైలి వేరు. ఆయన ఈ చిత్రంలో పోషించిన పాత్ర, నటన తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తాయ న్నారు. కె.ఆర్.విజయ, కోట శ్రీనివాసరావు, సాయికుమార్, కిన్నెర, సుధ, ఝాన్సీ, అలీ, కృష్ణభగవాన్, శ్రావణ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార, నమిత, స్నేహా వుల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. మిత్రుడు అనంతరం బాలకృష్ణ చేస్తున్న చిత్రం ఇదే.


Click it and Unblock the Notifications











