బాలయ్యకు 'సింహా' సెంటెమెంట్ కలిసొచ్చేనా?
బాలకృష్ణ కెరీర్ లో పెద్ద హిట్స్ అయిన సమర 'సింహా' రెడ్డి, నర'సింహ' నాయుడు, లక్ష్మీ నర'సింహ' చిత్రాలలో 'సింహా' అనేది కామన్ పదం, దాంతో ఇప్పుడు ఏకంగా 'సింహా' అనే టైటిల్ తో ముందుకొస్తున్నాడు. అయితే ప్రతీసారీ సింహా సెంటిమెంట్ కలిసివచ్చినట్లుగానే ఈ సారి కూడా వర్కవుట్ అవుతుందనే అంతా ఆశిస్తున్నారు. అయితే దర్శక,నిర్మాతలు మాత్రం అట్లాంటి సెంటెమెంట్ ఏమీ లేదు కేవలం కథ...పవర్ ఫుల్ ది కాబట్టి ఆ టైటిల్ పెట్టామంటున్నారు. ఇక నయనతార మహారాణి గెటప్ కూడా మరో రకం సెంటిమెంట్ అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న సంగతి తెలిసిందే. కాజల్(మగధీర), అనూష్క(అరుంధతి)లలో ఈ మహారాణి గెటప్ వచ్చి హిట్టయ్యాయి కాబట్టి ఈ సింహా కూడా గ్యారెంటీగా వర్కవుట్ అవుతుందంటున్నారు. బాలయ్యకు సెంటిమెంట్స్ ఎక్కువని అందరికీ తెలుసున్న విషయమే. అయితే ఆ చిత్రాల విషయంలో కూడా ఇలాంటి సెంటిమెంట్ విషయాలు చర్చకు రావటం విశేషం. ఇక ఈ సింహా చిత్రం ఈ నెలాఖరున (ఏప్రియల్ 30న) రిలీజ్ కానుంది. బోయపాటి శ్రీను దర్సకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నయనతార, స్నేహా ఉల్లాల్, నమిత హీరోయిన్స్ గా కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











