ఆ టైటిల్ తో వచ్చిన నా సినిమాలన్నీ సూపర్ హిట్లే... బాలకృష్ణ
'' సింహా పేరుతో కూడిన నా సినిమాలన్నీ ఘన విజయం సాధించాయి. 'బొబ్బిలి సింహం' 'సమర సింహారెడ్డి', 'నరసింహనాయుడు', 'లక్ష్మీ నరసింహ', 'సింహా' తదితర చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించాయి. 'సింహా'లో నా పాత్రను అపురూపంగా తీర్చిదిద్దారు దర్శకుడు బోయపాటి శ్రీను అంటూ సంబరపడ్డారు బాలకృష్ణ. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రెవేట్ టీవీ ఛానెల్ వారి పురస్కారాల ప్రదానోత్సవం కి హాజరైన బాలకృష్ణ ఇలా స్పందించారు.
అలాగే ... ''గెటప్ నుంచి పుట్టిన సినిమా 'సింహా'. అందులో నా మీసం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకొంది. తాజాగా 'శ్రీరామరాజ్యం'లో మీసం లేకుండానూ ప్రేక్షకుల్ని మెప్పిస్తా'' అంటున్నారు బాలకృష్ణ. జానపదం, సాంఘికం, పౌరాణికం తదితర చిత్రాల్లో భిన్నమైన పాత్రలు చేసే అవకాశం కల్పిస్తున్న కళామతల్లికి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు.


Click it and Unblock the Notifications











