బోయపాటి శీనుతో బాలకృష్ణ కొత్త చిత్రం 'సింహా'

By Srikanya

మిత్రుడు పరాజయం అనంతరం బాలకృష్ణ చేస్తున్న 'సింహా'చిత్రంపై అప్పుడే అంచనాలు ప్రారంభమయ్యాయి. అందుకు తగ్గట్లుగానే దర్శకుడు బోయపాటి శీను ఈ చిత్రాన్ని పెద్ద హిట్ ఇవ్వాలని కసితో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో బాలయ్య సింహాగా గా శక్తివంతమైన పాత్రలో కనిపించన్నారు.ఆయన గత చిత్రాలు భద్ర, తులసి మాదిరిగానే యాక్షన్‌ ప్యాక్‌డ్‌ ఎంటర్‌టైనర్స్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు బోయపాటి శ్రీను చెప్తున్నారు.

ఇక యునైటెడ్‌ మూవీస్‌ పతాకంపై పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత ఈ చిత్ర విశేషాలు మీడీయాకు తెలిపారు.."ఏకధాటిగా ఆర్‌ఎఫ్‌సీలో చిత్రీకరణ చేస్తున్నాం. ఇటీవలే ప్రేమ్‌రక్షిత్‌ నృత్య దర్శకత్వంలో బాలకృష్ణ, నమితలపై ఓ పాటను చిత్రీకరించాం. ప్రస్తుతం ఫైట్‌ మాస్టర్స్‌ రామలకణ్‌ నేతృత్వంలో చేజ్‌ తీస్తున్నాం. బాలకృష్ణ, స్నేహా ఉల్లాల్‌, ఆదిత్య మీనన్‌ తదితరులపై ఉత్కంఠభరితంగా. ఈ చేజ్‌ను చిత్రీకరిస్తున్నాం. సినిమాలో కీలకమైన ఎపిసోడ్‌ ఇది. నవంబర్‌ 2 వరకు చేజ్‌ తీసి, ఆ తర్వాత కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం' అని తెలిపారు.

డిసెంబరుకి షూటింగ్‌ పూర్తవుతుందని, సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ బి.మహేంద్రబాబు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: చక్రి, కెమెరా: ఆర్థర్‌, ఎ.విల్సన్‌, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు. ఇక బీష్మ కాన్సిల్ కావటంతో బాలయ్య పూర్తి స్ధాయిలో ఈ చిత్రంపైనే కాన్సర్ టేట్ చేసినట్లు చెప్తున్నారు. అలాగే వంశానికొక్కడు, పెద్దన్నయ్య వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ చిత్రం అని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X