బాలకృష్ణకి హఠాత్తుగా ఈ తెలంగాణ అభిమానం ఏమిటో!?
తెలంగాణ వీరుడు 'కొమరం భీమ్' ని గొప్పతనాన్ని వివరించే పాటని బాలకృష్ణ పాడుతున్నట్లుగా 'పరమవీర చక్ర' చిత్రం కోసం చిత్రీకరిస్తున్నారు. దాసరి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో ఈ పాట ప్రత్యేకమైన సందర్భంలో వస్తుందని చెప్తున్నారు. అయితే మొదట ఈ పాట అనుకోలేదని, చివరి నిముషాల్లో వేరే పాట అనుకుని ఈ పాట వైపు తిరిగారని అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ పాటని చిత్రీకరిస్తున్నారు. బాలయ్యతో పాటు చిత్ర తారాగణం అంతా ఆ పాటలో పాల్గొంటున్నారు. ఈ పాటను మరో నాలుగు రోజుల పాటు చిత్రీకరిస్తారు. ఇన్నాళ్ళుగా ఏ సినిమాలోనూ తమ తెలుగుదేశం పార్టి గురించి తప్ప ఊసెత్తని బాలయ్య హఠాత్తుగా పై తెలంగాణ వీరుడు కొమరం భీమ్ పై పాట రాయించి నటించటంలో ఏమన్నా అవసరాలు ఉన్నాయా అనేది ఇప్పడు అందరికి వస్తున్న కొత్త సందేహం. రేపు తమ సినిమాలు రిలీజ్ కు తెలంగాణ ఏరియాల్లో సమస్య తలెత్తకుండా ఈ జాగ్రత్తలా ఏమిటీ అనేది ఎవరికీ అంతుపట్టటం లేదు. మరో ప్రక్క నాగార్జున ఇప్పటికే తాను తెలంగాణా స్లాంగ్ లో మాట్లాడుతూ రాజన్న అనే చిత్రం చేస్తున్నానని ప్రకటించేసారు.


Click it and Unblock the Notifications











