అభిమానిని కొట్టిన బాలయ్య

గంటలు తరబడి నిరీక్షించిన అభిమానులు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో తోపులాట జరిగి ఒక అభిమాని బాలకృష్ణపై పడ్డారు. వెంటనే తీవ్ర ఆగ్రహంతో బాలకృష్ణ అతని చెంప చెళ్ళుమనిపించారు. అంతే చుట్టుప్రక్కల వారు నివ్వెరపోయారు. చిన్నబుచ్చుకున్న ఆ అభిమాని అవమాన భారంతో వెనతిరిగాడు.అయితే అనుకోని విధంగా బాలయ్యపై అతను పడటంతో అనాలోచితంగానే చేయిచేసుకోవటం జరిగిందని కొందరు అంటున్నారు. ఇక ఈ విషయం పార్టీ వర్గాల్లో టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











