twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ vs టీడీపీ రచ్చ.. ఎన్టీఆర్ కు బాలకృష్ణ ఫ్యామిలీ సపోర్ట్.. టీడీపీ నేతల విమర్శలకు కౌంటర్!

    |

    ఏపీ పాలిటిక్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఆసక్తికరంగా మారింది. కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ని అవమానించినట్టు ప్రచారం జరిగింది.. చంద్రబాబు స్వయంగా ప్రెస్మీట్ పెట్టి ఏడవడం తో పెద్ద ఎత్తున దుమారం రేగింది. జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయం మీద స్పందించడం మీద తెలుగుదేశం పార్టీ నుంచి భిన్నమైన ప్రకటనలు వస్తున్నాయి.. తాజాగా బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ కుమార్ ఈ విషయం మీద స్పందించారు ఆ వివరాల్లోకి వెళితే..

     పిరికి మాటలు అంటూ

    పిరికి మాటలు అంటూ

    ఈ రోజు 12 గంటల దీక్ష చేస్తున్న టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య మాట్లాడుతూ, ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మరియు ఆయన భార్య భువనేశ్వరిపై జరిగిన అవమానకర ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు తనకు నచ్చలేదని అన్నారు. ఈ సంఘటన గురించి జూనియర్ ఎన్టీఆర్ చాలా పిరికి ధోరణిలో మాట్లాడారని, ఎలా కాకుండా ఆయన తన కుటుంబానికి అండగా నిలవాలని వర్ల అన్నారు.

    చిన్నల్లుడి సపోర్ట్

    చిన్నల్లుడి సపోర్ట్

    మరో ఇద్దరు ప్రముఖ టీడీపీ నేతలు ఇదే వాదన చేశారు. వర్ల కామెంట్స్ నిజమేనని వారు అన్నారు. ఎన్టీఆర్ సింహాద్రి రేంజ్ లో విరుచుకు పడతాడు అనుకుంటే చాగంటి ప్రవచనాలు చెప్పారని అన్నారు. వర్ల వ్యాఖ్యల పై తారక్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సోషల్ మీడియాలో టీడీపీ వర్సెస్ ఎన్టీఆర్ వార్ మొదలైంది. ఇప్పుడు, బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ ఈ వ్యవహారం మీద స్పందించారు. ఒకరకంగా ఆయన చాలా పరిణతి చెందిన వాదన వినిపించారు. ఆయన మాట్లాడుతూ అసలు ముందుగా "ఈ సంఘటనపై స్పందించినందుకు జూనియర్ ఎన్టీఆర్‌ ను అభినందించాలి.

    స్వాగతించాలి

    స్వాగతించాలి

    ఇదే అంశంపై భరత్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అతను స్పందించిన విధానం పూర్తిగా స్వాగతించదగ్గది అని, ఈ ప్రకటనలో మరింత దూకుడుగా వ్యవహరించనందుకు ఆయనని విమర్శించలేమని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులని మాటలతో దాడి చేసినప్పుడు ఆయన ఆయనంతట ఆయనే బయటకు వచ్చాడని, దాని గురించి ఇప్పుడు చర్చించడం, ఆయనని విమర్శించడం అసంబద్ధం, "అని భరత్ అన్నారు. ఇంకా మాట్లాడుతూ, భరత్ మరో మంచి ఉదాహరణను పేర్కొన్నాడు.

     అది నిజం కాదుగా

    అది నిజం కాదుగా

    అలా "ఉదాహరణకు, సినిమా టిక్కెట్ల రేటు సమస్య ఇప్పుడు బర్నింగ్ టాపిక్. కానీ ఒక్క తెలుగు హీరో కూడా దీని గురించి మాట్లాడటం లేదు. అయినప్పటికీ, వారు దాని గురించి ఆందోళన చెందరని దీని అర్థం కాదు, "అని భరత్ పేర్కొన్నారు. ఇక టీడీపీ వర్సెస్ ఎన్టీఆర్ వార్ తీవ్ర స్థాయికి చేరుకుంటున్న తరుణంలో, టీడీపీ నుంచి ఎవరైనా పరిణతితో వ్యవహరించి ఈ వివాదాన్ని సద్దుమనిగేలా చేయడం కోసం భరత్ రంగంలోకి దిగి ఆ పని చేయడం మంచిదని బావిస్తున్నారు.

    Recommended Video

    Akhanda Movie టార్గెట్.. | Naga Chaitanya మాస్ లో క్లాస్ ! || Filmibeat Telugu
    జూనియర్ అనుచరులుగా

    జూనియర్ అనుచరులుగా

    ఆంధ్రప్రదేశ్లో కొడాలి నాని, వల్లభనేని వంశీ రాజకీయంగా ఎదగడానికి జూనియర్ ఎన్టీఆర్ ఒక రకంగా కారణమని చెప్పవచ్చు.. అయితే జూనియర్ ఎన్టీఆర్ అనుచరులు గా పేరు పొందిన కొడాలి నాని, వల్లభనేని వంశీ ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. వీరు చంద్రబాబుని చంద్రబాబు కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి కామెంట్లు చేయడంతో ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్గా దుమారం రేగింది.

    English summary
    Balakrishna son in law Bharat made comments supporting junior NTR.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X