ఆదిత్య 369 సీక్వెల్‌లో మోక్షజ్ఞ! బాలకృష్ణ కూడా.. ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!

By Rajababu

Recommended Video

ఆదిత్య 369 సీక్వెల్‌లో తండ్రీ కొడుకులు.. ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!

నటసింహం బాలకృష్ణ కెరీర్‌లో అద్భుతమైన చిత్రంగా నిలిచిన ఆదిత్య 369 చిత్రానికి సీక్వెల్ సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ విషయాన్ని ఆదిత్య 369 చిత్రానికి దర్శకత్వం వహించిన సింగీతం శ్రీనివాస్‌రావు ఇటీవల జాతీయ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించడం గమనార్హం.

 ఆదిత్య 369 సీక్వెల్‌ రెడీ

ఆదిత్య 369 సీక్వెల్‌ రెడీ

సింగితం శ్రీనివాసరావు తెలిపిన ప్రకారం.. ఆదిత్య 369 సీక్వెల్‌కు స్క్రిప్టు సిద్ధమైంది. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞతో ఈ చిత్రాన్ని తీయాలనుకొంటున్నాను. అయితే బాలకృష్ణ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు అని సింగీతం వెల్లడించారు.

 బాలకృష్ణకు కీలక పాత్ర

బాలకృష్ణకు కీలక పాత్ర

బాలకృష్ణకు కూడా ఆదిత్య 369 సీక్వెల్‌లో కీలక పాత్ర ఉంటుంది. ఆయన కూడా ఈ చిత్రంలో నటిస్తారు. అయితే మోక్షజ్ఞ ఇందులో హీరో పాత్ర పోషిస్తాడు. బాలకృష్ణ ఓకే చెబితే సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది అని సింగీతం పేర్కొన్నారు.

 1991లో ఆదిత్య 369 హల్‌చల్

1991లో ఆదిత్య 369 హల్‌చల్

1991 సంవత్సరంలో విడుదలైన ఆదిత్య 369 చిత్రం తెలుగు ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురిచేసింది. టైమ్ ట్రావెల్ ఆధారంగా నిర్మితమైన ఆ చిత్రం విడుదలైన ప్రతీ చోట ఘన విజయాన్ని సొంతం చేసుకొన్నది.

 బాలకృష్ణకు జంటగా మోహిని

బాలకృష్ణకు జంటగా మోహిని

ఆదిత్య 369 చిత్రంలో బాలకృష్ణకు జంటగా మోహిని నటించారు. హీరోయిన్ తండ్రి రూపొందించిన టైమ్ మిషన్‌లో ప్రయాణించే బాలకృష్ణ వందల ఏళ్లు వెనకకు వెళ్తాడు. శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలోకి కూడా ప్రవేశిస్తాడు. ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించిన ఆ చిత్రం సినీ విమర్శకులను కూడా మెప్పించింది.

 ఆదిత్య 369 సీక్వెల్‌పై ఆసక్తి

ఆదిత్య 369 సీక్వెల్‌పై ఆసక్తి

ప్రస్తుతం మోక్షజ్ఞ కథానాయకుడిగా మారి నటించే ఆదిత్య 369 సీక్వెల్ కథ ఎలా ఉంటుందో అనే ఆసక్తి నెలకొన్నది. ఒకవేళ ఈ చిత్రం సెట్స్‌పైకి వెళితే నందమూరి అభిమానులకు పండుగే పండుగ. ఎందుకంటే బాలయ్యతోపాటు మోక్షజ్ఞ కూడా తెరమీద కనిపించడం ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకానే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X