తెరంగేట్రానికి రెడీ అవుతున్నబాలయ్య తనయుడు మోక్ష..!
నటసింహ నందమూరి బాలకృష్ణ వారసుడిగా ఆయన కుమారుడు మోక్షజ్ఞ ను తెలుగు తెరకు పరిచయం చేసే కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రాబోయే సెప్టెంబర్ 6వ తేది నాటికీ 17 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న మోక్షజ్ఞ కు మరో రెండు సంవత్సరాలలో తన నట వారసత్వాన్ని కట్ట బెట్టే విధంగా బాలయ్య ప్రణాళిక సిద్దం చేసినట్టు తెలుస్తుంది.
ఆ మేరకు మోక్షజ్ఞ బాలయ్య పర్యవేక్షణలో నటనలో ఓనమాలు దిద్దుతున్నాడు. అలాగే సాదారణ విద్యతో పాటు డాన్సు క్లాసులు, ఫైటింగ్ క్లాసులు అతని టైం టేబుల్ లో భాగం అయినట్టు సమాచారం. మరో వైపు మోక్షజ్ఞ తోలి చిత్రం బాలయ్య దర్శకత్వంలోనే ఉండవచ్చు అని వార్తలు కూడా వినపడుతున్నాయి. పౌరాణికి నేపద్యంలో మోక్షజ్ఞ రాముడిగా, బాలయ్య రావణాసురుడిగా ఆ చిత్రం ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఈ వార్త విని ఆ కాంబినేషన్ ఊహించుకుని సంబరపడిపోతున్న నందమూరి అభిమానులు ఆ సినిమా కోసం వేయి కళ్ళతో వేచి చూస్తున్నారు.


Click it and Unblock the Notifications