అభిమానులకు షాకిస్తున్న మోక్షజ్ఞ లేటెస్ట్ ఫోటో.. ఇలా అయితే కష్టమే బాబు!

నందమూరి వారసుల నుంచి ప్రస్తుతం స్ట్రాంగ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న కుర్రాడు మోక్షజ్ఞ తేజ. బాలకృష్ణ ఆభిమానులు అతని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత మూడేళ్ళ నుంచి మోక్షజ్ఞ ఎంట్రీపై అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల వారసుడి ఎంట్రీపై కూడా స్పందించాడు బాలయ్య. ప్రస్తుతం మోక్షజ్ఞకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Recommended Video

Nandamuri Mokshagna Is Not Ready Yet, Latest Look Goes Viral
 మూడేళ్ళుగా..

మూడేళ్ళుగా..

మోక్షజ్ఞ వయసు ప్రస్తుతం 25ఏళ్ళు. గత మూడేళ్ళ నుంచి అతని ఎంట్రీ ఉంటుందని నందమూరి వారి నుంచి టాక్ వస్తూనే ఉంది. మోక్షజ్ఞ ఎప్పుడైతే 20లోకి వచ్చాడో అప్పటి నుంచే నటనపై అలాగే సినిమాలకు సంబంధించిన అనేక విషయాల గురించి తెలుసుకుంటున్నాడు అని కామెంట్స్ వచ్చాయి. దీంతో అభిమానుల్లో అంచనాలు తారా స్థాయికి చేరాయి.

రెడీ అవ్వలేదు..

రెడీ అవ్వలేదు..

సాధారణంగా వారసులు ఎవరైనా సరే 20 ఏళ్ళ వయసులోకి రాగానే జనాలను ఎట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే బాలయ్య తనయుడు మాత్రం ఇంకా జనాల ముందుకు రావడం లేదు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న వంటి వారు చాలా ఫాస్ట్ గానే సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇచ్చారు. కానీ మోక్షజ్ఞ ఇంకా రెడీ అవ్వలేదు.

లేటెస్ట్ ఫోటో వైరల్..

లేటెస్ట్ ఫోటో వైరల్..

నిన్న బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా మోక్షజ్ఞ విష్ చేస్తున్న ఒక ఫోటో బయటకు వచ్చింది. అయితే హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఏ మాత్రం రెడీగా లేడని ఆ ఫోటో చూస్తుంటే అర్ధమవుతోంది. ఫిట్నెస్ విషయం గురించి అసలు ఏ మాత్రం ఆలోచించడం లేదని కామెంట్స్ వస్తున్నాయి. ఓ విధంగా అభిమానులకు చాలా రోజుల తరువాత మోక్షజ్ఞ కనిపించడం మంచి విషయమే అయినప్పటికీ ఈ విధంగా దర్శనమివ్వడం ఒక షాకింగ్ విషయమనే చెప్పాలి.

అందుకే రెండేళ్లు..

అందుకే రెండేళ్లు..

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ తన కొడుకు ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అనే విషయంపై ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. ఇంకా రెండేళ్ల సమయం పట్టవచ్చని ఒక కామెంట్ అయితే చేశాడు. మోక్షజ్ఞను చూస్తుంటే కూడా ఇప్పట్లో ఎంట్రీ ఇచ్చేలా లేడని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇకపోతే మోక్షజ్ఞ అభిమానులను దృష్టిలో ఉంచుకొని ముందుగానే రెడీ అయితే బావుంటుందనే కామెంట్స్ వస్తున్నాయి. మరి నెక్స్ట్ టైమ్ ఈ నందమూరి వారసుడు ఎలా ఎంట్రీ ఇస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X