బాలకృష్ణను చెప్పనివ్వండి:పురంధరేశ్వరి

By Staff
Purandareswari
బాలకృష్ణ మనసులో ఏముందో ఏమోకానీ ఒక్కమగాడు ఆడియో విడుదల ఫంక్షన్ లో దాసరి నారాయణరావు చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దర్శకరత్న దాసరి నారాయణరావు కాంగ్రెస్ పార్టీలో ఉండడమే కాకుండా కేంద్రమంత్రి పదవిలో కూడా కొనసాగుతున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగుతూ బాలకృష్ణ రాజకీయ భవితవ్యంపై వ్యాఖ్యానాలు చేయడం సొంత పార్టీలోనే విమర్శలకు తావిచ్చినట్టయింది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అయిన వి హనుమంతరావు దాసరిపై విరుచుకుపడ్డారు. చిరంజీవిని రెచ్చగొట్టెలా దాసరి వ్యాఖ్యానించడమేమిటని ప్రశ్నించాడు. పార్టీకి----ఫిర్యాదు కూడా చేశాడు.

ఇదిలా ఉంటే బాలకృష్ణ సోదరి, కేంద్రమంత్రి పురంధరేశ్వరి కూడా బాలకృష్ణ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. గుంటూరులో ఆమె, భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లోకి ప్రవేశించే విషయమై బాలకృష్ణను చెప్పనివ్వండి చూద్దాం అని వారిద్దరూ అన్నారు. గుంటూరు, తెనాలిలో సోమవారం వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె వద్ద కేంద్రమంత్రి దాసరి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా ఆమె పై విధంగా స్పందించారు. రాజకీయ ప్రవేశంపై బాలకృష్ణ మాట్లాడాలి కదా అని ఆమె చెప్పారు. తాను వీటిపై ఏమీ మాట్లాడలేనని చెప్పారు.

పురంధరేశ్వరి ఇలా మాట్లాడుతుండగానే దగ్గుబాటి వెంకటేశ్వరరావు సెల్ తో బాలకృష్ణకు ఫోన్ చేశారు. ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం పురంధరేశ్వరి కూడా బాలకృష్ణతో మాట్లాడారు. నీ రాజకీయ ప్రవేశంపై అందరూ అడుగుతున్నారు అని ఆమె బాలకృష్ణతో అంది...అటునుంచి ఏం సమాధానం వచ్చిందో తెలియదు కానీ ఆమె కొద్దిసేపు నవ్వారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X