సంక్రాంతికి విడుదల కాబోతున్న చిత్రం ఒక్క మగాడు. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడా అని వైవియస్ చౌదరిని అడిగితే ఆ విషయం చెప్పనని నిక్కచ్చిగా చెప్పాడు. అయితే సినిమాలో బాలయ్య రెండు విభిన్న గెటప్ లలో కనిపిస్తున్నాడనేది నిజం. ఒక గెటప్ లో బాలయ్య అద్భుతంగా కనిపిస్తున్నడు. మేకప్ అదిరిపోయేలా ఉందని అనుకుంటున్నారు. ఈ గెటప్ కోసం బాలయ్య, దర్శక నిర్మాత వైవియస్ చౌదరి చాలా రిస్కే తీసుకున్నట్టు సమాచారం. ఈ గెటప్ కోసం ఇద్దరూ హాలీవుడ్ లో 20 రోజులు గడిపి వచ్చినట్టు తెలుస్తోంది. అక్కడ మేకప్ టిప్స్ తెలుసుకొన్న తరువాతే ఒక్క మగాడు మొదలయినట్టు భొగట్టా. ఆ టిప్స్ ప్రకారమే బాలయ్యతో పాటు సిమ్రాన్ కు కూడా మేకప్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఒక్క మగాడు మేకప్ కోసం రోజూ బాలయ్య మూడు నుంచి నాలుగు గంటల సమయం తీసుకున్నట్టు సమాచారం. ఈ మేకప్ కోసం బాలకృష్ణ తీసుకున్న కనపరిచిన శ్రద్ధ అమోఘమని వైవియస్ చౌదరి అంటున్నారు. ఇందుకోసం బాలయ్య ఉదయం మూడున్నర గంటలకే మేల్కొని మేకప్ కు కూర్చుని 9కెల్లా షూటింగ్ కు రెడీ అయ్యేవారని వైవియస్ అంటున్నారు.