twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ ఎన్టీఆర్ కోసం బాలకృష్ణ స్పెషల్ రెకమెండేషన్...

    By Sindhu
    |

    నటసింహా బాలకృష్ణ కోసం 'సింహా"ను దర్శకత్వం చేసి చిప్పట్టుకుపోతున్నాడు బోయపాటి శ్రీను. సినిమా హిట్టై బాలకృష్ణ మాత్రం ఓ అరడజను ఆఫర్లు వెనకేసుకుంటే బోయపాటి మాత్రం ఓ డజన్ ఆడియో ఫంక్షన్లకు హాజరై డిగ్రీ చేతబట్టుకున్న నిరుద్యోగిలా హీరోల ఇళ్ల చుట్టూ ప్రదక్షణలు చేస్తూ కాలం వెల్లబుచ్చుతున్నాడు.

    ఇంకో సంవత్సరం ఆగితే పర్మనెంట్ గా ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుందెమో అన్న దిగాలు పట్టుకున్న బోయపాటి లేటు చేయకుండా జూ ఎన్టీఆర్ కోసం తయారు చేసిన కొత్త కథను మళ్లీ వినిపించేందుకు దుబాయ్ బయలుదేరాడు. బాలకృష్ణ రికమెండేషన్ మీద స్పెషల్ కోటా కింద జూ ఎన్టీఆర్ ఈ చిత్రం చేస్తున్నట్టు, అందుకే 'శక్తి" అయ్యేలోపే అంతా రెడీగా ఉంటే రెండు నెలల్లో బోయపాటితో ఫినిష్ చేసేందుకు యంగ్ టైగర్ గట్టి ప్లానే వేసాడట పాపం ఇలాగైనా బోయపాటి బోరుకొట్టకుండా ఉంటుంది. ఈ చిత్రానికి కె యస్ రామారావు నిర్మాణ సారధ్యం వహిస్తున్నాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X