అభిమానులు ముందే పండగ చేసుకొంటున్నారు: బాలకృష్ణ
అభిమానులు పండగ వేడుకను ముందే చేసుకొంటున్నారు. 'పరమవీర చక్ర' చిత్రంలో కొమరం భీమ్, సైనికుడు, నటుడు ఇలా పలు పాత్రల్లో కనిపిస్తా. రావణబ్రహ్మగా చేసిన మరో పాత్ర ఉంది. అది పౌరాణికాలను నాంది పలికేలా ఉంటుంది. మణిశర్మ చక్కటి సంగీతం అందించారంటూ మాట్లాడారు బాలకృష్ణ. ఆయన హీరోగా దాసరి దర్శకత్వంలో చేసిన పరమవీరచక్ర చిత్రం ఆడియో విడుదల నిన్న(బుధవారం)రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా బాలకృష్ణ ఆనందంతో ఇలా మాట్లాడారు. అలాగే...దాసరి దర్శకత్వంలో నేను శివరంజని సినిమాలో నటించాల్సింది. అయితే అప్పుడు నేను చదువుకొంటున్నందువల్ల నాన్నగారు వద్దని చెప్పారు. యాధృచ్ఛికమో, కాకతాళీయమో ఆయన దర్శకత్వంలో వస్తున్న 150 చిత్రంలో నా 50వయేట నటించా అన్నారు. ఇదే వేదికపై బాలచందర్, రామ్ నారాయణలని సత్కరించారు. దేశరక్షణలో అవయవాలు కోల్పోయిన సైనికులకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజమౌళి, వినాయక్, కల్యాణ్‌రామ్, తారకరత్న, షీలా, బోయపాటి శ్రీను, బి.గోపాల్, కేఎస్ రామారావు, తమ్మారెడ్డి భరద్వాజ, అలీ, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











