అదేమన్నా కొత్త రకం పరమాన్నమా?: బాలకృష్ణ
''రామాయణం అంటే అదేమన్నా కొత్త రకం పరమాన్నమా? అనే విధంగా నేడు సొసైటీ తయారైంది. అలాంటి పరిస్థితుల్లో 'శ్రీరామరాజ్యం' వాళ్లకొక పాఠ్యాంశంగా నిలిచింది'' అని బాలకృష్ణ అన్నారు.బాలకృష్ణ హీరోగా,బాపు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'శ్రీరామరాజ్యం'. 'శ్రీరామరాజ్యం' యాభై రోజుల వేడుక గురువారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది.ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే...''జానపదమైనా, పౌరాణికమైనా, చారిత్రకమైనా, సాంఘికమైనా అన్ని రకాల పాత్రల్లో నాన్నగారు మెప్పించారు. అదంతా ఆయన మొదలుపెట్టిన ట్రెండే. ఆ దారిలోనే నేను నడుస్తున్నా.
బాపు దర్శకత్వంలో నాన్నగారు తన 52వ యేట 'శ్రీరామాంజనేయ యుద్ధంలో నటించారు. నేను కూడా ఇప్పుడు అదే వయసులో 'శ్రీరామరాజ్యం'లో నటించడం దైవసంకల్పం. 'లవకుశ' కథను మళ్లీ తీస్తానంటే నాకు ధైర్యం వచ్చింది. ఎన్టీఆర్ బిడ్డగా ఆ పాత్రకు న్యాయం చేయగలననిపించింది. బాపు నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఎన్టీఆర్ రక్తమే నాలో ప్రవహిస్తోందని ఆయనకు తెలుసు. మన సంస్కృతిని చాటిచెప్పే చిత్రమిది. ఈ సినిమా సాంఘికమా..? పౌరాణికమా..? అనేది చెప్పలేం. కానీ నాకు 'మాయాబజార్'లా అనిపించింది. ఇలాంటి సినిమాల్ని అందరూ చూడాలి. నిర్మాత యలమంచిలి సాయిబాబు నిజమైన హీరో'' అన్నారు.
కార్యక్రమానికి దాసరి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో ఇళయరాజా, నయనతార, కె.విశ్వనాథ్, యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, శ్రీకాంత్, రామానాయుడు, రాఘవేంద్రరావు, కృష్ణంరాజు, ఏడిద నాగేశ్వరరావు, జొన్నవిత్తుల, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











