తారకరత్న గుర్తుగా బాలయ్య గొప్ప పని: ఇకపై ఎవరూ అలా చనిపోకుండా.. వాళ్లందరికీ ఉచితంగానే!

నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. తనదైన నటనతో ప్రత్యేకమైన ముద్రను వేసుకుని.. చాలా చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించాడు తారకరత్న. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న అతడు.. కళ్లు తిరిగి పడిపోవడం.. ఆ తర్వాత గుండెపోటుకు గురవడం.. ఇలా దాదాపు 23 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత కన్నుమూయడం చకచకా జరిగాయి. ఈ బాధ నుంచి నందమూరి ఫ్యాన్స్ ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా బాలకృష్ణ.. తారకరత్న కోసం ఓ గొప్ప పని చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

ఫ్యామిలీ, ఫ్యాన్స్‌ విషాదంలో

ఫ్యామిలీ, ఫ్యాన్స్‌ విషాదంలో

తీవ్రమైన గుండెపోటుకు గురైన తర్వాత బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో నందమూరి తారకరత్నకు చికిత్సను అందించిన విషయం తెలిసిందే. దీంతో అతడు కోలుకుంటాడని అంతా భావించారు. కానీ, అనుకోని విధంగా ఈ సుదీర్ఘమైన పోరాటంలో తారకరత్న ఓడిపోయాడు. తద్వారా నందమూరి ఫ్యామిలీలో, అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాడు.

భార్య, పిల్లలు ధీనస్థితిలోనే

భార్య, పిల్లలు ధీనస్థితిలోనే

నందమూరి తారకరత్న తన తల్లిదండ్రులకు ఇష్టం లేకుండానే అలేఖ్య రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో చనిపోయే వరకూ వాళ్లతో సత్సంబంధాలు లేకుండానే ఉన్నాయి. ఇప్పుడు తారకరత్న మరణం తర్వాత అలేఖ్య రెడ్డికి అత్తింటి వారి నుంచి మాత్రం సపోర్ట్ లేకుండా పోయిందని అంటున్నారు. దీంతో ఆమె పిల్లలతో కలిసి ధీనస్థితిలోనే ఉండిపోయారు.

కుటుంబ పెద్దగా బాలకృష్ణ

కుటుంబ పెద్దగా బాలకృష్ణ

నందమూరి తారకరత్నకు బాబాయి బాలకృష్ణ అంటే చాలా ఇష్టం. అందుకే మొదటి నుంచీ వీళ్లిద్దరి మధ్య తండ్రీ కొడుకుల సంబంధం ఉండేది. అందుకే అతడు గుండెపోటుకు గురైనప్పటి నుంచి బాలయ్య అన్నీ తానై చూసుకున్నారు. కొడుకును కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి చనిపోయిన తర్వాత కూడా తారకరత్న కుటుంబ పెద్దగానే వ్యవహరించారు.

పిల్లల బాధ్యత తీసుకుంటూ

పిల్లల బాధ్యత తీసుకుంటూ

నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆయన ముగ్గురు పిల్లలు తండ్రి లేని వాళ్లు అయిపోయారు. దీంతో తాతయ్య బాలకృష్ణ ఆ పిల్లల బాధ్యతను స్వయంగా తీసుకున్నారు. ఈ విషయాన్ని తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి చెప్పి ఆమెకు భరోసాను కల్పించారు. అందుకు తగ్గట్లుగానే ఆ పిల్లలు కూడా బాలయ్యపై ప్రేమను చూపించడం కొన్ని వీడియోలలో స్పష్టంగా కనిపించింది.

తారకరత్న కోసం గొప్ప పని

తారకరత్న కోసం గొప్ప పని

నటసింహా నందమూరి బాలకృష్ణ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అక్కడ అధునాతన సదుపాయాలతో ఓ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. దాన్ని క్రమంగా అభివృద్ధి పరుస్తున్నారు. ఇప్పుడు అక్కడ తారకరత్న పేరు మీద కొన్ని సేవా కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు.

ఉచితంగా విలువైన వైద్యం

ఉచితంగా విలువైన వైద్యం

నందమూరి తారకరత్న గుండెపోటుతో మరణించడంతో ఇప్పుడు బాలయ్య ఆయన గుర్తుగా హిందూపురంలోని ఆస్పత్రిలో Cardiothoracic surgery (కార్డియోథొరాసిక్ సర్జరీ)ని అందుబాటులోకి తీసుకు వచ్చేలా ప్లాన్ చేశారని తెలిసింది. ఎంతో విలువైన ఈ వైద్యాన్ని ఉచింతంగానే పేద ప్రజలకు అందించబోతున్నారని ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెలిపారు.

భారీ ఖర్చుతో సామాగ్రిలు

భారీ ఖర్చుతో సామాగ్రిలు

హిందూపురంలోని ఆస్పతిలో ఉన్న H-Blockకు నందమూరి తారకరత్న పేరును పెట్టాలని కూడా బాలకృష్ణ నిర్ణయించినట్లు తెలిసింది. అంతేకాదు, ఏకంగా రూ. 1.30 కోట్లు విలువ చేసే Surgical Instrumentsను కూడా తెపిస్తున్నారట. అలాగే, చిన్నపిల్లలకి ఉచిత భోజనంతో పాటు కావాల్సిన మందులు కూడా 3 నెలల పాటు ఫ్రీగా అందించనున్నారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X