Bhagavanth Kesari: బిడ్డా... చిచ్చా వచ్చిండు... మనకి పండగ ముందే తెచ్చిండు!
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం భగవంత్ కేసరి. ఇక ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో అందాల చందమామ బాలయ్య సరసన హీరోయిన్ గా నటిస్తుండగా... టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల కూతురి పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి గణేష్ ఫుల్ సాంగ్ రిలీజ్ అయి ఆకట్టుకుంటోంది. ఆ వివరాల్లోకి వెళితే...
నందమూరి బాలకృష్ణ పుల్ జోష్ లో ఉన్నారు. అఖండ, వీరసింహరెడ్డి హిట్ల తర్వాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం నేలకొండ భగవంత్ కేసరి. ఇక ఈ సినిమాకు శీర్షిక ఐ డొంట్ కేర్ అని పెట్టడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో మొదటి సారిగా చందమామ కాజల్ అగర్వాల్.. బాలయ్యతో జత కట్టనుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య కూతురిగా శ్రీలీల కనిపించనుంది.

భగవంత్ కేసరి సినిమాను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇటీవల గణేష్ అంతెం కూడా రిలీజ్ అయి ఆకట్టుకుంది. ఈ సినిమాలో మొదటి సారి బాలయ్య తెలంగాణ యాసలో మాట్లాడపోతున్నారు.

ఇక తాజాగా భగవంత్ కేసరి సినిమా నుంచి గణేష్ అంతెం రిలీజ్ అయింది. ఇక ఫుల్ అండ్ మాస్ తెలంగాణ యాసలో ఈ సాంగ్ ఉంది. అదిరిపోయే మేనరిజంతో బాలయ్య ఎంటర్ అవ్వగా.... బిడ్డా.. ఆన్తలేదు.. సప్పుడు జర గట్టిగా చేయమను.. అని బాలయ్య చెప్తాడు. చిచ్చా వచ్చిండు.. ఇక కొట్టర కొట్టు సౌమారు అంటూ శ్రీలీల డ్యాన్స్ చేస్తుంది.

ఇందులో బాలయ్య శ్రీలీలతో కలిసి వేసే స్టేప్పులు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సాంగ్ కు తమన్ ఇచ్చిన మ్యూజిక్ అల్టీమేట్.. ఇక అన్ని గణేష్ మండపాల్లో ఈ పాట దుమ్ములేపనుంది. అఖండ, వీరసింహరెడ్డి లాంటి చాట్ బస్టర్స్ అందించిన తమన్... ఇప్పుడు బాలయ్యతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధం అయ్యాడు. తమన్ అందించిన మ్యూజిక్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు.
ఇక పాటను ఆలపించిన వారు మనీషా, కారీముల్లా కాగా... కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఇక ఈ పాటకు శ్రీలీలతో కలిసి బాలయ్యతో స్టెప్పులు వేయించింది శేఖర్ మాస్టర్. మొత్తానికి ఈ పాట వింటుంటే... బాలయ్య ఫ్యాన్స్ కే కాదు.. అందరికీ గుస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











