Bhagavanth Kesari: బాలయ్య-తమన్ మ్యాజిక్ రిపీట్.. చిచ్చాతో దుమ్ములేపిన శ్రీలీల
నందమూరి బాలయ్య ఫుల్ జోష్ మీద ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారభంలో సంక్రాంతికి 'వీరసింహారెడ్డి మూవీతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే టీజర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పాట ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ఆ వివరాల్లోకి వెళితే....
నందమూరి బాలకృష్ణ.. సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా... కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తోంది. ఇక ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇక భగవంత్ కేసరి సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న వేళ.. మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్.. విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో బాలయ్య తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతుంటే.. గుస్ బంప్స్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకు సంగీతం తమన్ అందించారు. ప్రియాంక జవాల్కర్, అర్జున్ రామ్ పాల్ ఇతర కీలకపాత్రల్లో కనిపించనున్నారు.
ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా రూ. 75 కోట్లకు జరిగిందని సమాచారం. అంతేకాదు ఈ సినిమా బాలయ్య సినీ కెరీర్‌లో అత్యంత ఎక్కువగా జరిగిందని తెలుస్తోంది. గతంలో బాలయ్య సినిమాల బిజినెస్ విషయానికి వస్తే.. వీరసింహారెడ్డి రూ. 73 కోట్లు, అఖండ రూ. 54 కోట్లు, రూలర్ రూ. 24 కోట్లు, ఎన్టీఆర్ కథానాయకుడు రూ. 70 కోట్లుగా ఉంది.

మరోవైపు డిజిటల్ హక్కులు రూ. 40 కోట్లకు అమెజాన్ ప్రైమ్ ఐదు భాషలకు సంబంధించిన డీల్ పూర్తైయినట్టు టాక్. ఈ చిత్రాన్ని తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. ఇక బాలయ్య, శ్రీలీలపై వచ్చే సన్నివేశాలు అభిమానులను అలరించేలా ఉంటాయని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాలోని గణేష్ ఆంతెమ్ పాట ప్రోమోను విడుదల చేశారు మేకర్స్.
ఇక ఈ ప్రోమోలో... అదిరిపోయే మేనరిజంతో బాలయ్య ఎంటర్ అవ్వగా.... బిడ్డా.. ఆన్తలేదు.. సప్పుడు జర గట్టిగా చేయమను.. అని బాలయ్య చెప్తాడు. చిచ్చా వచ్చిండు.. ఇక కొట్టర కొట్టు సౌమారు అంటూ శ్రీలీల డ్యాన్స్ చేస్తుంది. ఈ గణేష్ ఆంతెమ్ ఫుల్ సాంగ్ ను ఈ సెప్టెంబర్ 1న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.
ఈ పాటలో బిడ్డ అంటూ బాలయ్య .. తెలంగాణ యాసలో పలికిన డైలాగులు కేక పుట్టిస్తున్నాయి. మొత్తం పాట రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుందో చూడాలి ఇక. ఇక ఈ పాటకు తమన్ అందించిన సంగీతం గుస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. మరోసారి వీరి కాంబో మ్యాజిక్ చేయనుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











