బాలయ్య సీక్రెట్ లీక్ చేసేసారు

By Srikanya

బాపు తాజా చిత్రం శ్రీరామరాజ్యం లో రాముడుగా బాలకృష్ణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాముడుగా బాలకృష్ణ ఎలాగ ఉండబోతున్నరనేది చాలా సీక్రెట్ గా ఎక్కడా లీక్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని దర్శక, నిర్మాతలు కాపాడుకుంటూ వచ్చారు. అయితే రీసెంట్ గా ఆ గెటెప్ లీక్ అయిపోయింది. ఎవరు చేసిన పనోగానీ బాలకృష్ణ అభిమానులకు మాత్రం పండుగే అయ్యింది. అయితే శ్రీరామరాజ్యం ఆడియో విడుదల నాడే ఈ మ్యాటర్ లీక్ అవటంతో కావాలనే క్రేజ్ క్రియేట్ చేయటానికి ఈ గెటప్ స్టిల్ లీక్ చేసారా అనే సందేహం కూడా చాలా మందికి కలుగుతోంది. ఇక నయనతార గెటప్ ని నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలో విడుదల చేసారు.

ఈ పౌరాణిక చిత్రాన్ని సెప్టెంబర్ 16న విడుదల చేయటానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో రామారావు గారు నటించిన లవకుశ కళాఖండాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ దృశ్య కావ్యాన్ని తెరకెక్కించారు. శ్రీరాముని జననం నుంచి రావణాసుర సంహారం వరకూ పదినిషాల పాటలో ఆ కథంతా ఉంటుంది. శ్రీ సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముళ్లపూడి వెంకటరమణ రచన చేస్తున్నారు. ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీరాముడు రాజుగా పాలించిన ఘట్టమే ఈ చిత్రానికి ప్రధాన కథాంశం. ఈ చిత్రానికి పాటలు: జొన్నవిత్తుల, వెన్నెలకంటి, సినిమాటోగ్రఫీ:పి.ఆర్.కె. రాజు, కూర్పు: జి.జి. కృష్ణారావు, కళ: రవీంద్ర, గ్రాఫిక్స్: కమల్ కణ్ణన్, డాన్స్: శ్రీను, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: తాండవ కృష్ణ, స్క్రీన్‌ప్లే, మాటలు: ముళ్లపూడి వెంకటరమణ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X