‘శ్రీరామ రాజ్యం’ 50 రోజుల వేడుక వివరాలు
బాలయ్య నటించిన పౌరాణిక చిత్రం శ్రీరామ రాజ్యం పెద్దగా సంచలనాలు సృష్టించక పోయినా మంచి టాక్ తో 50 రోజుల వేడుక దిశగా దూసుకెలుతోంది. చిత్ర నిర్మాతలు శ్రీరామ రాజ్యం ఆడియో వేడుకలను జనవరి 5న విజయవాడలో నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. అయితే విజయవాడలో వేడుక జరిగేది ఎక్కడ అనేది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఇప్పటి వరకు తెలిసిన వివరాల ప్రకారం పిడబ్లుడి గ్రౌండ్స్ లో ఫంక్షన్ జరుపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామ రాజ్యం సినిమాను యలమంచిలి సాయిబాబు నిర్మించారు. బాలయ్య అద్భతైమన నటన, సీతపాత్రలో నటించకుండా జీవించిన నయనతార అభియనం, కళ్లు చెదిరే సెట్టింగులు వెరసి...శ్రీరామ రాజ్యం సినిమా వెండితెరపై నయనానందకరమైన కావ్యంగా వెలుగుగొందుతోంది. గోవా 42వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లోనూ శ్రీరామ రాజ్యం ప్రదర్శించబడింది. ఇటీవల కాలంలో శ్రీరామ రాజ్యం లాంటి పౌరాణిక సుందర దృశ్య కావ్యం భారతీయ తెరపై రాలేదంటే అతిశయోక్తి కాదేమో.


Click it and Unblock the Notifications











