నేడు బాలయ్య అభిమానులకు పండగరోజు
నేడు నందమూరి బాలకృష్ణ అభిమానులకు పండగ రోజు. ఎందుకంటే ఈ రోజు బాలయ్య నటించిన శ్రీరామ రాజ్యం సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామ రాజ్యం సినిమా 49 సెంటర్లలో 50 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. దర్శక నిర్మాతలు ఈ రోజు హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో 'విజయోత్సవ వైభవం' పేరుతో కార్య్రకమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి దర్శకరత్న దాసరి నారాయణరావు చీప్ గెస్ట్ గా హాజరవుతుండగా, కళా తపస్వి కె. విశ్వనాథ్, డి. రామానాయుడు, రమేష్ ప్రసాద్, యోడిద నాగేశ్వరరావు, కె. రాఘవేంద్రరావు, కృష్ణం రాజు తదితరులు హాజరుకానున్నారు.
బాపు దర్శకత్వంలో, యలమంచిలి సాయిబాబు నిర్మాణ సారథ్యంలో శ్రీరామ రాజ్యం సినిమా అద్భుత దృశ్య కావ్యంగా తెక్కిన విషయం తెలిసిందే. సీతారాముల పాత్రలు పోషించిన బాలయ్య, నయనతారలకు ఈ సినిమా ద్వారా ఎనలేని కీర్తి లభించింది.


Click it and Unblock the Notifications











