శ్రీరామ రాజ్యానికి క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్
బాలయ్య తాజా సినిమా 'శ్రీరామ రాజ్యం" సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ 'యూ" సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ నెల 17న సినిమా భారీ ఏర్పాట్ల మధ్య విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య రాముడి పాత్ర చేస్తుండగా, నయనతార సీత పాత్రలో నటించింది. శ్రీకాంత్ లక్ష్మణుడిగాను, వాల్మీకిగాను కినిపించబోతున్నాడు. సీరియర్ ఎన్టీఆర్-అంజలి దేవి నటించిన 'లవ కుశ" చిత్రం ఆదారంగా శ్రీరామ రాజ్యం రూపొందించినట్లు ఫిల్మ్ నగర్ టాక్.
బాపు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యలమంచిలి సాయిబాబు నిర్మించగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఇలయరాజా సంగీతం అందించారు. ఈ సినిమా పూర్తి పౌరాణిక నేపథ్యం సాగుతుంది. ఇప్పటికే విడుదలైన సినిమా ఆడియోకు శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే తరహాలో సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు శ్రీరామ రాజ్యం సినిమా యూనిట్ సభ్యులు. శ్రీరామ రాజ్యం హిట్టయితే మరిన్ని పౌరాణికా సినిమాలతో అలరిస్తానని ఇటీవల సినిమా ప్రమోషన్లో బాలయ్య అభిమానులకు స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











