twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ 'శ్రీరామరాజ్యం' లేటెస్ట్ ఇన్ఫో

    By Srikanya
    |

    పౌరాణిక చిత్రాల్లో 'శ్రీరామరాజ్యం' ప్రత్యేకంగా నిలుస్తుంది. శ్రీరాముడి పాలనను తెర మీద చూడొచ్చు. ఇళయరాజా స్వరపర్చిన పాటల రికార్డింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌ శివార్లలో ప్రత్యేకంగా సెట్‌ని తీర్చిదిద్దామన్నారు నిర్మాత యలమంచిలి సాయిబాబు. శ్రీరామునిగా బాలకృష్ణ, సీతగా నయనతార రూపొందుతున్న పౌరాణిక చిత్రం 'శ్రీరామరాజ్యం'. బాపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వాల్మీకిగా అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మణునిగా శ్రీకాంత్ నటిస్తున్న ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహిస్తున్నారు.

    శ్రీ సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముళ్లపూడి వెంకటరమణ రచన చేస్తుండగా, ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 2 నుంచి 8 వరకు చిత్రీకరణ జరిపారు. సమ్మె కారణంగా తాత్కాలికంగా షూటింగ్ ఆపామని సాయిబాబు తెలిపారు. "ఇప్పటికి సగం పాటనూ, కొంత టాకీని చిత్రీకరించాం. ఇందులో ప్రధాన తారాగణంతో పాటు 200 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. వాల్మీకి ఆశ్రమానికి సంబంధించిన సెట్‌ను భారీ స్థాయిలో వేశాం. ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తయింది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడకుండా అప్పటి 'లవకుశ' స్థాయికి ఈ చిత్రాన్ని తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తాం అన్నారు.

    బాలయ్య, మురళీమోహన్, బ్రహ్మానందం, రఘునాథరెడ్డి, సుబ్బరాయశర్మ, విందు ధారాసింగ్, కె.ఆర్. విజయ, జయసుధ, సుధ, సన, ఝాన్సీ తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: వెన్నెలకంటి, జొన్నవిత్తుల, ఛాయాగ్రహణం: పి.ఆర్.కె. రాజు, కూర్పు: జి.జి. కృష్ణారావు, కళ: రవీందర్, గ్రాఫిక్స్: కమల్ కణ్ణన్, కాస్ట్యూమ్స్: తిరుమల, కొరియోగ్రఫీ: శ్రీను.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X