అయోధ్య శ్రీరామునిగా బాలకృష్ణ గారిని చూసుకొని తరిస్తాము..!
అంతా ఉత్కంట భరితంగా ఎదురుచూస్తోన్న నందమూరి బాలకృష్ణ - బాపు ల భక్తి రస చిత్రం 'శ్రీ రామ రాజ్యం". ఈ సినిమా నవంబర్ 17వ తేదీన ప్రపంచవ్యాప్తం గా విడుదల చేసేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాలయ్య రాముని గెటప్ కు మంచి స్పందన కనిపిస్తుంది. అంతేకాదు ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, ఫొటోస్ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాలు చూసిన అనుభవజ్ఞుల అభిప్రాయమేమంటే, బాలయ్యను చూస్తుంటే, అచ్చం లెజండరీ ఎన్టీయార్ ను చూసినట్లుందని.
ఈ చిత్రం హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మించారు. సిజిఐ, స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ విభాగంలో అపార అనుభవంగల నిష్ట్నాతులు పనిచేసారు. ఇళయరాజా అందించిన సంగీతం శ్ర్తోతలను మంత్ర ముగ్దులను చేసింది. నయనతార సీత పాత్రను పోషించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు వాల్మీకి పాత్రలో కనిపిస్తారు. లక్ష్మణునిగా శ్రీకాంత్ నటించారు. 'శ్రీ రామ రాజ్యం" చిత్రానికి లెజండరీ డైరెక్టర్ బాపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రామాయణం లోని లవ, కుశల అధ్యాయాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించారు.
కాగా మొట్ట మొదటి తెలుగు సినిమా రంగంలో అత్యంత ధరకు (6000డాలర్లు)అమెరికాలో అమ్ముడైన శ్రీరామరాజ్యం టికెట్. న్యూ జెర్సీకి చెందిన జితేందర్ కుమార్ అనే వ్యక్తి శ్రీరామ రాజ్యం టికెట్ ను 6000డాలర్లు పెట్టి తీసుకున్నారు. ఆ టికెట్ కొన్న అభిమానులు స్పందన ఏంటంటే మేము ఇక్కడి (అమెరికా) నుంచి అయోధ్యకు వెళ్లి శ్రీరామున్ని దర్శించుకోవాలంటే కొన్ని లక్షలు వెచ్చించాలి కానీ మేము కేవలం ఈ టికెట్ తో అయోధ్య శ్రీరామునిగా బాలకృష్ణ గారిని చూసుకొని తరిస్తాము. ఈ పుణ్యకార్యం కోసం టికెట్ కు పెట్టిన 2500డాలర్లు తక్కువే అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.....


Click it and Unblock the Notifications











