బాలకృష్ణ 'శ్రీరామరాజ్యం'విడుదల ఎప్పుడంటే..

By Srikanya

బాలకృష్ణ,నయనతార కాంబినేషన్ లో బాపు దర్శకత్వంలో రూపొందుతున్న 'శ్రీరామరాజ్యం' చిత్రం . జూన్ 10కి విడుదల చేయటానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ విషయాలును నిర్మాత యలమంచిలి సాయిబాబు మీడియాకు వివరిస్తూ... శ్రీరామచంద్రుడిలోని విశిష్టత ఏమిటి? ఇంతకీ ఆయన పాలన ఎలా ఉండేది? లవకుశల జననం, లక్ష్మణుడు సీతను అడవిలో వదిలేయడం, వాల్మీకి ఆమెను ఆదరించడం వంటి పలు కీలక ఘట్టాలను తెరకెక్కించాం. ఇందులో లక్ష్మణుడిగా శ్రీకాంత్‌, భరతుడిగా సాయికుమార్‌ నటిస్తున్నారు. రాముని జననం నుంచి రావణాసుర సంహారం వరకు కథనంతా చెప్పే పది నిమిషాల పాట చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఒక దృశ్యకావ్యంగా తీర్చిదిద్దుతున్నారు బాపు.

మార్చి నెలాఖరు నుంచి మరో షెడ్యూల్‌ చిత్రీకరణ మొదలవుతుంది.. జూన్ 10కి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు. శ్రీరాముడిగా నందమూరి బాలకృష్ణ, సీతగా నయనతార ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వాల్మీకి పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మిగతా పాత్రల్లో మురళీమోహన్‌, బాలయ్య, కే.ఆర్‌.విజయ, విందు ధారాసింగ్‌, సుధ, జయసుధ, నాగినీడు, బ్రహ్మానందం, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: ఇళయరాజా. ముళ్లపూడి వెంకటరమణ రచయిత. ఇటీవలే ఒక షెడ్యూల్‌ పూర్తయింది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో దర్బారు, ఏకాంత మందిరం, కౌసల్య మందిరం, రాజప్రసాదం, అయోధ్య నగరం తదితరసెట్స్‌ నిర్మాణాలు జరుగుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X