twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ యుగపురుషుడైన శ్రీ రాముడుగా ’శ్రీరామ రాజ్యం’

    By Sindhu
    |

    బాపు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా రూపుదిద్దుకొంటున్న 'శ్రీ రామరాజ్యం" చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకొని సెప్టెంబరులో విడుదలకు సిద్దమవుతుంది. శ్రీ రామరాజ్యం" చిత్రం బాపు దర్శకత్వంలో.యలమంచిలి సాయిబాబు నిర్మాణ సారధ్యంలో ,ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతంతో రూపుదిద్దుకొంది.ఈ చిత్రంలో బాలకృష్ణ యుగపురుషుడైన శ్రీ రాముడుగా, మహా సాద్వి సీతమ్మ తల్లి పాత్రలో నయన తార, అన్న మాట జవదాటని లక్ష్మణుడి పాత్రలో శ్రీకాంత్, వాల్మీకి మహర్షి పాత్రలో అక్కినేని నాగేశ్వర రావు నటిస్తున్నారు.

    ఈ చిత్రంకోసమై రామోజీ ఫిలిం సిటీలో అప్పటి శిలపకళా నైపుణ్యాన్ని తలపిస్తూ కళా దర్శకులు రవీందర్, కిరణ్ ల నేతృత్వంలో భారీ సెట్ లను తీర్చిదిద్దారు. వీటిలో రాజదర్బార్, రాజ్‌మహల్ వంటివి వెండి తెరపై ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయని నిర్మాత సాయిబాబు తెలిపారు. 'శ్రీ రామరాజ్యం" చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకొన్న సందర్బంగా షూటింగ్ చివరి రోజున శ్రీ రాముని పాత్రలో నటించిన బాలకృష్ణకు చిత్ర యూనిట్ పుష్పాభిషేకం చేసారు.ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లడుతూ మా నాన్న గారు చేసిన పాత్రను చేయడం నిజంగా నా పుణ్యఫలం.శ్రీ రామరాజ్యం పేరుతో 1943 లో ఓ చిత్రం వచ్చింది.ఆ చిత్రంలో ని కొంతభాగాన్ని లవకుశ లో వాడుకోవడం జరిగింది. సీతను అడవులకు పంపాక శ్రీ రాముడు సీతల వియోగం ఈ చిత్రంలోని ప్రధానాంశంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల వారిని అలరిస్తుందని తెలిపారు.

    English summary
    Balakrishna and Nayantara's 'Sree Ram Rajyam' shooting completed and soon post production work will start.'Sree Ram Rajyam' movie release in September 2011. Ekantha Mandiram, Kausalya Mandiram and Rajaprasadam are being constructed in RFC.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X