twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆగస్టు 30న బాలయ్య ‘శ్రీమన్నారాయణ’

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాలకృష్ణ కథానాయకుడిగా ఆర్.ఆర్. మూవీమేకర్స్ సమర్పణలో రవికుమార్ చావలి దర్శకత్వంలో రమేష్ పుప్పాల నిర్మిస్తున్న 'శ్రీమన్నారాయణ' ఆగస్టు 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత రమేష్ పుప్పాల చిత్ర విశేషాలను వివరిస్తూ-' మా ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై ద్వీతీయ చిత్రంగా బాలకృష్ణతో ఈ శ్రీమన్నారాయణ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని తెలిపారు.

    ఈ చిత్రాన్ని ఆగస్టు 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభించింది. పాటలు అన్ని వర్గాల శ్రోతలను విశేషంగా అలరించాయి. ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్‌ని ఆగస్టు 26న హైదరాబాద్ లో గ్రాండ్ గా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈచిత్రం మంచి విజయాన్ని అందుకుని మా బ్యానర్‌కు మంచి పేరును తెస్తుందన్న నమ్మకం నాకుంది'' అన్నారు.

    బాలకృష్ణ, పార్వతీమెల్టన్, ఇషాచావ్లా, విజయ్‌కుమార్, సురేష్, వినోద్‌కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్‌రెడ్డి, కృష్ణ్భగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, కెమెరా: టి.సురేందర్‌రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: నాగేందర్, నిర్మాత: రమేష్ పుప్పాల, కథ, కథనం, దర్శకత్వం: రవికుమార్ చావలి.

    English summary
    Nandamuri Balakrishna's most sought after movie 'Srimannarayana' ready to release on August 30. Balayya would be seen as a powerful TV journalist in this movie, which is directed by Ravikumar Chavali. Isha Chawla and Parvati Melton have played the lead roles in the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X