రెడ్డి హౌజ్‌లో బాలయ్య సినిమా షూటింగ్
నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రవి చావలి దర్శకత్వంలో 'శ్రీమన్నారాయణ' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రమేష్ పుప్పాల నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జూబ్లీ హిల్స్ లోని పాష్ రెసిడెన్సీ రెడ్డీ హౌజ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. బాలయ్య ఇల్లు, పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని సీన్లు చిత్రీకరించనున్నట్లు సినిమా యూనిట్ సభ్యుల ద్వారా అందిన సమాచారం. ఈ చిత్రంలో బాలయ్య సరసన పార్వతి మెల్టన్, ఇషా చావ్లాలను హీరోయిన్లుగా ఎంపిక చేశారు.
బాలయ్య ఈ చిత్రంలో జర్నలిస్టుగా నటిస్తున్నారు. మాస్ మసాలా ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ సినిమాలో అభిమానులు మెచ్చే పూర్తి వినోదాత్మక యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు హీరోయిన్లుతో గ్లామర్ డోస్ కూడా కాస్త ఎక్కువగానే ఉండేలా సినిమా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
బాలయ్య నటించిన అధినాయకుడు సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో బాలయ్య మూడు పాత్రల్లో కనిపించనున్నారు. మరో వైపు మనోజ్ హీరోగా రూపొందుతున్న 'ఊకొడతారా ఉలిక్కి పడతారా' చిత్రంలో బాలయ్య ప్రముఖ పాత్రలో కనిపించబోతున్నారు. బాలయ్య ముసలాయన గెటప్ లో దర్శనం ఇవ్వబోతున్నారని, మనోజ్ తాత క్యారెక్టర్లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. మంచు మనోజ్ సరసన దీక్షాసేథ్ నటిస్తోంది. శేఖర్‌రాజా దర్శకత్వంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











