twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య ‘శ్రీమన్నారాయణ’ లేటెస్ట్ అప్డేట్స్

    By Bojja Kumar
    |

    నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న 'శ్రీమన్నారాయణ' చిత్రం మలేషియాలో ఓ పాట, ఓ ఫైట్ చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం స్విట్జర్లాండ్, ఇటలీలలో పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఆర్ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై బాలకృష్ణ కథానాయకుడిగా రవికుమార్ చావలి దర్శకత్వంలో 'మిరపకాయ్' నిర్మాత రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    ఈ సందర్భంగా నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ...'మలేషియాలో తీసిన ఫైట్, సాంగ్ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి. ఈ షెడ్యూల్‌లో చేసిన వర్క్ 'శ్రీమన్నారాయణ'కు హైలెట్‌ అవుతుంది. ప్రస్తుతం యూరఫ్‌లో రెండు పాటల్ని భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నాం. జూన్ 18న స్టార్ట్ అయిన ఈ షెడ్యూల్ జూన్ 28 వరకు జరుగుతుంది. దీనితో 'శ్రీమన్నారాయణ' టోటల్ షూటింగ్ పూర్తవుతుంది. జులైలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసి ఆగస్టులో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. బాలకృష్ణతో శ్రీమన్నారాయణ లాంటి భారీ చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు అభిమానులు బాలయ్య నుంచి ఎక్స్‌పెక్ట్ చేసే అన్ని అంశాలు 'శ్రీమన్నారాయణ'లో ఉంటాయి అన్నారు.

    బాలకృష్ణ, పార్వతీ మెల్టన్, ఇసా చావ్లా, విజయ్ కుమార్, సురేష్, వినోద్ కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, కృష్ణ భగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, సినిమాటోగ్రఫీ: టి.సురేందర్ రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: నాగేందర్, కో డైరెక్టర్: ఎస్ సురేష్ కుమార్, పబ్లిసిటీ డిజైనర్ : రమేష్ వర్మ, కాస్ట్యూమ్స్: ప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: వి.చంద్రమోహన్, మేనేజర్స్: కమల్ మోహన్ రావు, రామ్మోమన్, నిర్మాత: పుప్పాల రమేష్, కథ-కథనం-దర్శకత్వం: రవికుమార్ చావలి.

    English summary
    Nandamuri Balakrishna's forthcoming movie 'Srimannarayana' team is back from Malaysia after shooting some important scenes and a song. Currently shooting in Switzerland to picturize a song on Balakrishna. Isha Chawla and Parvati Melton have been paired as heroines opposite to Balakrishna. Shooting will be completed with the Switzerland schedule and the dubbing work will commence after that. Ravi Chavali is directing 'Srimannarayana' and Ramesh Puppala is producing this movie under Yellow Flowers Banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X