Bhagavanth Kesari Trailer: భగవంత్ కేసరి వచ్చిండు.. ష్ సప్పుడు జెయ్యాక్.. బాలయ్య చివరి పంచ్ కేక
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో చిత్రాలు తెరకెక్కుతోన్నాయి. కానీ, అందులో కొన్ని మూవీలు మాత్రమే ఆరంభంలోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించుకుని భారీ స్థాయిలో హైప్‌ను క్రియేట్ చేసుకుంటున్నాయి. అలాంటి వాటిలో నటసింహా నందమూరి బాలకృష్ణ - సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'భగవంత్ కేసరి' ఒకటి.
బాలయ్య - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమానే 'భగవంత్ కేసరి'. క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో తీస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీని విడుదలకు రెడీ చేస్తున్నారు.

'భగవంత్ కేసరి' సినిమాను అక్టోబర్ 19 తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దీంతో ఇప్పుడు చిత్ర నిర్మాతలు ప్రచారం చిత్రాలపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగానే తాజాగా హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. అంగరంగ వైభవంగా రాబోతున్న ఈ వేడుకలోనే 'భగవంత్ కేసరి' సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
తాజాగా విడుదలైన ట్రైలర్'నువ్వు ఏడున్నా ఇట్ల దమ్ముతో నిలబడాలే. అప్పుడే ఈ దునియా నీకు బాంచన్ అంటది' అనే బాలయ్య డైలాగుతో ప్రారంభం అయింది. ఆ తర్వాత హీరో తన కూతురిని (శ్రీలీల) ఆర్మీలోకి పంపాలని ప్రయత్నాలు చేయడం.. కానీ, ఆమె మాత్రం తన వల్ల కాదని చేతులెత్తేయడం వంటి వాటిని చూపించి తండ్రి కూతురు బంధాన్ని హైలైట్ చేశారు.
ఆ తర్వాత తన కూతురిని ఇబ్బంది పెట్టిన రౌడీలతో భగవంత్ కేసరి యుద్దానికి సిద్ధం అవుతాడు. అప్పటి నుంచి ట్రైలర్‌లో వేగం అందుకుటుంది. ఇక, ఇందులో కనిపించిన విజువల్స్, బాలయ్య నోట నుంచి వచ్చిన పవర్‌ఫుల్ పంచ్ డైలాగులు, థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. చివర్లో తన పాటలపై వస్తున్న ట్రోల్స్‌కు బాలయ్యే స్వయంగా పంచ్ వేయడం హైలైట్ అనే చెప్పాలి.

మొత్తంగా 'భగవంత్ కేసరి' మూవీ ట్రైలర్ బాలయ్యలోని కొత్త యాంగిల్‌ను చూపించేలా ఉంది. ఈ విషయంలో మాత్రం అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడని అర్థం అవుతోంది. ముఖ్యంగా ఈ ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ రెట్టింపు అవుతాయి అనడంలో ఏమాత్రం సందేహమే లేదు.
ఇదిలా ఉండగా.. 'భగవంత్ కేసరి' మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. శ్రీలీల కీలక పాత్రను చేస్తున్న విషయం తెలిసిందే. అర్జున్ రాంపాల్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. దీనికి థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 19న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











