బాలకృష్ణ మనస్సులో అందుకు పెద్దపీటే వేశారు....
బాలకృష్ణ మదిలో నర్తనశాల తీయాలనే ఆశ ఇంకా చిగుర్లు తొడుగుతూనే ఉంది. ఆమద్య నర్తనశాల తీస్తున్నట్టు ప్రకటించి కొంతపార్టుతీసారు. అందులో శ్రీహరి భీముడుగాను, బాలకృష్ణ, సుయోధన, కీచక, అర్జున వేషాలు వేసేందుకు తన తండ్రిలా ఐదుపాత్రలతో బాటు దర్శకత్వం వహించాలనుకున్నారు. ఇందులో ద్రౌపదిగా నయనతార లేక స్నేహా తీసుకొంటున్నట్టు సమాచారం. అందుకు తగ్గట్టుగానే నిర్మాత లభించాడు. ఏకారణం చేతనో ఆప్రాజెక్టు ఆగిపోయింది.
ఇప్పుడు శ్రీరామరాజ్యం చిత్రం బాపుతీస్తున్నారు అందులో బాలకృష్ణ రామునిగా వేస్తున్నారు. అదే మాత్రం హిట్ అయినా తాను నర్తనశాల తీస్తానని ప్రకటించారు. బాలకృష్ణకు పౌరాణిక చిత్రాలు చేయాలనే ఆశ ఉండనే ఉంది. తన తండ్రిలా పలువేషాలు వేయాలనుకుంటున్నారు. ఆయనకు అందిరావడంలేదు. ఈ మద్య పెద్ద ఆశతో తీసిన పాండురంగడు పరాజయం కావడంతో ఆయన నిర్మాతలు సాంఘిక చిత్రాలైతే రెడీ పౌరాణికాలకు ముందుకు రావడంలేదు. దాంతో సాంఘిక చిత్రాలకే బాలకృష్ణ పరిమితం అయ్యారు.


Click it and Unblock the Notifications











