బాలయ్య జై సమైక్యాంధ్ర-‘శ్రీరామ రాజ్యం’ తిప్పలు తప్పవా?
సినీ నటుడు బాలకృష్ణ బసవ తారకం క్యాన్సర్ ఆసుప్రతిలో మంగళవారం ఇస్కాన్ టెంపుల్ వారి ఉచిత అన్నదాన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 'ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విడిపోకుండా సుభిక్షంగా ఉండాలి" అంటూ వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న ప్రస్తుత తరుణంలో బాలయ్య నోట సమైక్య వాదం వినిపిచడంతో 'శ్రీరామ రాజ్యం" సినిమా నిర్మాతలకు కష్టాలు తప్పవనే వాదన వినిపస్తోంది ఫిల్మ్ నగర్ లో... తెలంగాణకు మద్దతు తెలపనందుకే చాలా మంది తెలుగు హీరోల సినిమాలను అడ్డుకోవడం, వారి సినిమా షూటింగులపై దాడులు చేయడం లాంటి ఘటనలకు పాల్పడ్డారు తెలంగాణ వాదులు. ఇంత జరిగాక కూడా బాలయ్య నోరు మూసికుని మిన్నకుండక వారిని అనవసరంగా కెలిగాడు అనే వాదన వినిపిస్తోంది. కొన్ని రోజుల్లో శ్రీరామ రాజ్యం సినిమా విడుదల కానున్న నేపథ్యంలో బాలయ్య వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. మరి ఏం జరుగబోతోందో? వెయిట్ అండ్ సీ.


Click it and Unblock the Notifications