తొడలు కొట్టడంపై వివరణ ఇస్తూ..అభిమానులు తొడగొట్టమని, మీసం మెలేయాలని అడిగినప్పుడు, నాలో వచ్చిన ఉత్సాహం, ఉద్రేకం ఆపుకోలేనప్పుడు అలా చేస్తుంటానన్నారు. అయినా ఈ రెండు అంశాలు రోషం, రాజసానికిసంకేతాలని అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి, సాలూరు, పాచిపెంట, రామచంద్రాపురం మండలాల్లో ఆయన రోడ్ షో నిర్వహిస్తూ పై విధంగా ప్రసంగించారు. అలాగే కంటిచూపుతో రాష్ట్రంలోని అవినీతిని అంతం చేస్తానని బాలకృష్ణ ప్రజలకు హామీ ఇచ్చారు. అంతేకాక బొబ్బిలి పులిగా..తాండ్రపాపారాయుడుగా..జస్టిస్ చౌదరి కొడుకుగా వచ్చా..అవినీతిని అంతం చేస్తా..అంటూ బాలయ్యం ఆవేశపూరింతంగా అన్నారు. ఇక లక్ష్మీ పార్వతితో గొడవలు కోర్టులో ఉన్నాయని, దాని గురించి తానేమి మాట్లాడదలుచుకోలేదని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ని ఎన్నికలు అయిన తర్వాత వదిలేస్తారా అని అడిగిన ప్రశ్నకు ప్రతిభ,శ్రధ్దను బట్టి అతని సేవల్ని వినియోగించుకుంటుందని తెలిపారు.