చీపురు పట్టిన బాలయ్య: ఫ్యాన్స్‌కు పిలుపు (ఫోటోస్)
హైదరాబాద్: నందమూరి నటసింహం బాలయ్య స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ‘స్వచ్ఛ్ భారత్' కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో తాను కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. చీపురు పట్టి రోడ్లు ఊడ్చారు.
ఫేస్‌బుక్ ద్వారా అన్ని అప్‌డేట్స్ పొందండి
‘నేను స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నాను. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు. ఇది కేవలం ఒక రోజు మొక్కు బడిగా చేసే కార్యక్రమం కాదు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనే అవగాహన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ఇది కొనసాగాలి అన్నారు.
అభిమానులు, వెల్ విషర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలిని బాలయ్య పిలుపునిచ్చారు. మీకేమైనా డౌట్స్ ఉంటే నా ఈమెయిల్‌కు పంపండి. అదే విధంగా మీ స్వచ్ఛ్ భారత్ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా పంపండి అంటూ [email protected] అనే మెయిల్ అడ్రస్ ఇచ్చారు బాలయ్య. స్లైడ్ షోలో...

చీపురు పట్టిన బాలయ్య
చీపురు పట్టి రోడ్డు ఊడ్చేందుకు సిద్ధమైన బాలయ్య. ఆయనతో పాటు పలువురు అభిమానులు కూడా ఇందులో పాల్గొన్నారు.

కొనసాగాలి
స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం ఒక్కరోజు జరిగే కార్యక్రమం కాదని, ఇది కొనసాగుతూనే ఉండాలని బాలయ్య పిలుపునిచ్చారు.

అవగాహన
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలనే అవగాహన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.

సినిమా
ప్రస్తుతం బాలయ్య సత్యదేవ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన త్రిష నటిస్తోంది. ఈ చిత్రానికి ‘లయన్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.


Click it and Unblock the Notifications











