నా త్రిపాత్రాభినయం పవర్ ఫుల్ గా ఉంటుంది...బాలకృష్ణ

By Srikanya

ఇందులో నావి మూడు పాత్రలు. పవర్‌ఫుల్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఏకధాటిగా షూటింగ్ చేసి, మార్చిలోగా సినిమా పూర్తి చేస్తాం అని నందమూరి బాలకృష్ణ చెప్పారు. నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీ కీర్తి కంబైన్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్నారు.పరుచూరి మురళి దర్శకత్వంలో శ్రీకీర్తి కంబైన్స్ పతాకంపై ప్రొడక్షన్ నం.3గా ఎం.ఎల్.పద్మకుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సోమవారం హైదరాబాద్ ‌లో రెండో షెడ్యూలు మొదలైంది.మంగళవారం నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ...బాలకృష్ణ పోషించే పాత్రలు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తాయి. కథ, కథనాల్లో కొత్తదనం ఉంది. విశాఖపట్నంలో ఏకబిగిన నెల రోజులపాటు చిత్రీకరణ చేయబోతున్నాం. అక్కడ ప్రత్యేకంగా ఓ సెట్‌ని నిర్మిస్తున్నాము ..అలాగే బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా ఈ కథను తీర్చిదిద్దడం జరిగింది అన్నారు.

అభిమానులను రంజింప చేసే అన్ని అంశాలకు ఇందులో పెద్ద పీట వేస్తున్నాం. దర్శకుడు పరుచూరి మురళి గతంలో నా సంస్థలో పెదబాబు, ఆంధ్రుడు చిత్రాలు చేశారు. మురళి ఓ కసితో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కళ్యాణీ మాలిక్ సంగీతం, విజయ్ సి. కుమార్ ఛాయాగ్రహణం ఆకట్టుకునే విధంగా ఉంటాయి. సినిమా పూర్తయ్యే వరకూ నిరవధికంగా షూటింగ్ చేస్తాం. ఈ నెల 24 నుంచి వైజాగ్‌లో చిత్రీకరణ చేయబోతున్నాం. ఈ చిత్రంలో జయసుధ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్‌రాజ్‌, ఎమ్మెస్‌ నారాయణ, వేణుమాధవ్‌, ఆదిత్య మీనన్‌ తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: సందీప్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ సి.కుమార్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: కల్యాణిమాలిక్‌. ఇక రీసెంట్ గా పరుచూరి మురళి...నితిన్, ఇలియానాల కాంబినేషన్ లో రెచ్చిపో అనే డిజాస్టర్ ఫిలిం ని ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X