చిత్రాన్ని మోసేది అభిమానులే: బాలకృష్ణ
ప్రతి చిత్రాన్నీ మోసేది అభిమానులే. కానీ బాగా ఆడాలంటే మాత్రం అందరూ చూడాల్సిన కథలే ఒప్పుకోవాలి.కేవలం అభిమానుల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని కథల్ని ఒప్పుకోకూడదు అంటున్నారు బాలకృష్ణ. శుక్రవారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ సింహా చిత్రం విజయం గురించి చెప్పారు. అలాగే కథ ఒప్పుకునేటప్పుడు జనాలందరికీ నచ్చుతుందా? లేదా? అని మాత్రమే ఆలోచిస్తాను. ఇప్పటి ప్రేక్షకులు చాలా తెలివైనవారు. నేను 'సింహా' సినిమాలో లెక్చరర్ గా, డాక్టర్ గా కనిపిస్తాను అని ముందే తెలిస్తే కథ ఇట్టే ఊహించేస్తారు. ఆ విషయం తెర మీదే తెలిసింది కాబట్టి వారికి కొత్తగా అనిపించింది అన్నారు.
ఇక నేను చిత్ర పరిశ్రమకు వచ్చి 34 సంవత్సరాలైంది. అన్ని రకాల పాత్రలూ చేశాను. కానీ సింహా చూసినవాళ్లంతా 'ఇప్పుడు తెలిసింది బాలకృష్ణ సినిమా ఆడాలంటే ఏం కావాలో..' అంటున్నారు. ఓ కళాకారుడికి అంతకంటే కావల్సింది ఏముంది. ఇది ఆశ్చర్యంతో కూడిన ఆనందం. దర్శకుడు బోయపాటి శ్రీను కథ చెప్పినప్పుడే హావభావాలు ఏ మోతాదులో చేయాలో నిర్ణయించేసుకొన్నాను. సంభాషణలు కూడా సూటిగా ఉండేలా రాశారాయన. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా 'అర క్షణంలో చచ్చేవాడివి నీకెందుకురా నా అడ్రస్' అంటూ డైలాగులు చెబుతున్నారు అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసారు.


Click it and Unblock the Notifications











