చిరుకు టిడిపి బాలయ్య మందట??
చిరంజీవి రాజకీయాలలోకి రానున్నారన్న వార్త అన్ని రాజకీయ పార్టీలలో గుబులు పుట్టిస్తోంది. చిరంజీవి ఎఫెక్ట్ ను ఎలా ఎదుర్కోవాలా అనే విషయాలను వివిధ రాజకీయ పార్టీలు అపుడే చర్చిస్తున్నాయి. కాంగ్రెస్ ఏకంకా తమ పార్టీలోకే చిరంజీవి రావాలని ఆహ్వానించగా తెలుగుదేశం మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. చిరంజీవి పార్టీ పెడితే భూమి తలకిందులేం కాదని వ్యాఖ్యానించింది. పైకి అలా వ్యాఖ్యానించినా లోలోన తీవ్రమధన పడుతోంది. చిరంజీవి ఎఫెక్ట్ ను నివారించడానికి ఎత్తులు వేస్తోంది. ఆయన ఎఫెక్ట్ ను ఎదుర్కోవడానికి నందమూరి బాలకృష్ణను రంగంలోకి దింపడానికి సన్నాహాలు కూడా మొదలెట్టింది. ఆయనకు పార్టీ అధ్యక్ష పదవినే కట్టబెట్టాలని యోచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు, బాలకృష్ణలు బావా బావమరుదులే కాకుండా వియ్యంకులు కూడా. వీరిద్దరూ కలిసి నడిస్తే తెలుగుదేశంకు వచ్చే నష్టమేమి లేదని సీనియర్ నాయకులు అంటున్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











