బాలయ్య అధినాయకుడిగా తాత-తండ్రి గెటప్స్ కంటే కొడుకు గెటప్ అదుర్స్..!
నందమూరి బాలకృష్ణ హీరోగా పరుచూరి మురళి తెరకెక్కిస్తున్న చిత్రం 'అధినాయకుడు" ఇందులో బాలకృష్ణ తాతగా, తండ్రిగా, కొడుకుగా మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆల్ మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన లక్ష్మీరాయ్, ఛార్మీ, సలోని హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
బాలకృష్ణ నటిస్తున్న ఓల్డ్ గెటప్ కు జోడీగా సహజనటి జయసుధ నటిస్తోంది. ఈ చిత్రంలో జయసుధ బాలకృష్ణకి బామ్మగా కనిపించనున్నారు. బాలకృష్ణ వేసిన ముసలాయన గెటప్ కి ప్రేక్షకుల నుండి విపరీతమైన ఆదరణ లభించనుంది. చాలా కాలం క్రితం ద్విపాత్రాభినయంతో అలరించిన బాలకృష్ణ 'అధినాయకుడు"గా ఏకంగా మూడు పాత్రల్లో కనువిందు చేయబోతుండటంతో ఈ చిత్రంపై అందరిలోనూ భారీ అంచానాలు ఏర్పడ్డాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారంప్రకారం కళ్యాణీ మాలిక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియోను డిసెంబర్ 25న భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే బాలకృష్ణకు సంబంధించిన మూడు పాత్రల్లో రెండింటిని రివీల్ చేసిన చిత్రవర్గాలు మూడవ గెటప్ ని చాలా రోజులు గా సీక్రెట్ గా వుంచుతూ వస్తోంది. శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎమ్.ఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్న అధినాయకుడు చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో మూడవ గెటప్ మొదట రివీల్ చేసిన గెటప్ కంటే చాలా బాగుంది ఒరిజినల్ బాలకృష్ణ అదుర్స్ అంటున్నారు నందమూరి ఫ్యాన్స్.


Click it and Unblock the Notifications











