పవన్ తో పోలిక తెస్తారనే బాలయ్య ..

అయితే బాబు అటువంటిదేమీ ఉండదని నచ్చచెప్పి ముందుకు పంపుతున్నారని చెప్తున్నారు. అలాగే బాలకృష్ణని ఇప్పటికే అభిమాన సంఘాల నాయకులని కలవమని చెప్పటం జరిగిందని తెలుస్తోంది. ఇక బాలయ్య ని వారు ఎప్పుడు కలవాలనేది ఇప్పటికే అందరికి మెసేజెస్ పంపారని సమాచారం. అలాగే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్,తారకరత్న కూడా తమ తమ ఏక్టివిటీస్ ని పూర్తి స్ధాయిలో బాబు తో చర్చించి సూచనలు అనంతరం ముందడగు వేయాలని ఆదేశించినట్లు వినపడుతోంది.
అలా అటు పవన్ కళ్యాణ్ ఎలా ఏక్టివ్ గా పార్టీ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారో అదే స్దాయిలో తెలుగుదేశానికి బాలయ్య ఉపయోగపడతారని పార్టీ శ్రేణుల్లో మాట్లాడుకుంటున్నారు. ఆ మేరకు ఉత్సాహాన్ని పుంజుకుని పార్టీని నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. కుటుంబ పార్టీ అని విమర్శించినా పట్టించుకోవాల్సిన పనిలేదని అది ఏ మాత్రం విజయావకాశాలపై ప్రభావం చూపెట్టదని అంటున్నారు.


Click it and Unblock the Notifications











