శుభవార్త: తాతయ్య కాబోతున్న బాలయ్య
హైదరాబాద్: నారా, నందమూరి కుటుంబాల అభిమానులకు. ప్రముఖ తెలుగు సినీ నటుడు బాలకృష్ణ, చంద్రబాబు తాతలు కాబోతున్నారు. నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు త్వరలో అమ్మానాన్నలు కాబోతున్నట్లు వైద్యులు ధ్రువీకరించారు.
2007లో బాలకృష్ణ కూతురు బ్రాహ్మణితో చంద్రబాబు కుమారుడు లోకేష్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహంతో నందమూరి కుటుంబంతో బంధాన్ని చంద్రబాబు మరింత గట్టి పరుచుకున్నారు. ప్రస్తుతం బాలయ్య సినిమాల్లో నటిస్తూ బావ చంద్రబాబుతో పాటు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. హిందూపురం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ప్రస్తుతం బాలకృష్ణ సత్యదేవా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. రుద్రపాటి రమణారావు నిర్మాత. ఇందులో బాలకృష్ణ సీబీఐ అధికారిగా కనిపిస్తారని సమాచారం. బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఫొటోగ్రఫీ: వెంకటప్రసాద్. కళ: రవీందర్.



Click it and Unblock the Notifications











