హిందూపురం నుంచి బాలయ్య పోటీ?

By Staff

Balakrishna
గతంలో తన తండ్రి ఎన్టీఆర్‌ ప్రాతినిథ్యం వహించిన హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలన్న ఉద్దేశంతో బాలయ్య ఉన్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.ఆ నియోజకవర్గానికి చెందిన నేతలతో ఇప్పటికే ఆయన మాట్లాడుతున్నట్లు సమాచారం. అయితే రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలనుంచి, ప్రత్యేకించి గుంటూరు,కృష్ణా జిల్లాలనుంచి బాలయ్య బరిలోకి దిగాలని ఆయన అభిమానుల నుంచి భారీగా విజ్ఞప్తులు వస్తున్నాయి. దీనితో పునరాలోచనలో పడుతున్నారని తెలుస్తోంది.

అలాగే ఆయన తెలుగు దేశం పార్టీ గెలిచే దాకా తాను ప్రచారం చేస్తానని ఆయన బాలకృష్ణ స్పష్టం చేయటం ఈ నిర్ణయానికి మరింత బలం చేకూరుస్తోంది. ఆయన తండ్రిగారు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 13వ వర్ధంతి సందర్భంగా శనివారం ఎన్టీఆర్‌ ఘాట్‌కు చేరుకున్న బాలకృష్ణ ఈ విషయాన్ని ప్రకటించారన్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య పూర్తి స్ధాయిలో పార్టీ ప్రచారానికి నడుం బిగించనున్నారు. అందుకోసం ఆయన పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్ళనున్నారు.

బాలయ్య ఈ నెల 29న అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు.అందునిమిత్తం బాలయ్య రోడ్‌షోలకు ప్రత్యేక వాహనాన్ని రెడీ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బాలయ్య తన రోడ్‌షోలకోసం ప్రత్యేకవాహనాన్ని తయారు చేయించుకుంటున్నట్లు తెలిసింది. యాత్రలకు తరలివచ్చే అభిమానులందరికీ తాను కనిపించే విధంగా, అవసరమైతే స్థానిక నేతలతో మాట్లాడేందుకు అనువుగా ఈ వాహనం రూపు దిద్దుకుంటోందని సమాచారం.మొత్తానికి చూస్తుంటే బాలయ్య ఫుల్ టైమ్ పాలిటిక్స్ లోకి దిగినట్లు అర్ధమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X