కండలు కరిగిస్తున్న బాలయ్య.. బోయపాటి కోసం 20 కిలోలు.. ‘డబుల్ ధమాకా’‌తో ఝలక్

Recommended Video

Balakrishna To Appear In A New Look For Boyapati Movie || Filmibeat Telugu

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రణరంగం నుంచి బయటకు వచ్చిన నందమూరి బాలకృష్ణ ఇక వరుస సినిమాలపై దృష్టిపెట్టారు. అగ్రదర్శకులతో సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దర్శకుడు బోయపాటి శ్రీను, కేఎస్ రవికుమార్‌తో సినిమాలు చేయడానికి ముందుకెళ్తున్నారు. అయితే బోయపాటి వెనుకకు నెట్టి కేఎస్ రవికుమార్ సినిమాను ముందుకు తీసుకురావడం టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. అదేమిటంటే..

 బోయపాటి సినిమా వెనుకకు

బోయపాటి సినిమా వెనుకకు

ఏపీ ఎన్నికలకు ముందు బాలకృష్ణకు బోయపాటి శ్రీను ఓ పొలిటికల్ థ్రిల్లర్ కథను చెప్పాడనేది సినీవర్గాల టాక్. ఆ సమయంలో ఆసక్తిగా ఉండటం, ఎన్నికల వేళ యాప్ట్‌గా ఉంటుందనే కారణంతో ఆ కథకు బాలయ్య ఓకే చెప్పడం జరిగింది. కానీ ఎన్నికల తర్వాత ఆ కథ చేస్తే బాగుండదనే ఉద్దేశంతో ఓ సందేశాత్మక చిత్రంతో సిద్ధం కావాలని బోయపాటికి చెప్పడం జరిగిందట. ప్రస్తుతం పొలిటిక్‌ థ్రిల్లర్‌ను పక్కన పడేసి ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించే ప్లాన్‌లో బోయపాటి ఉన్నారు.

 కేఎస్ రవికుమార్‌తో బాలకృష్ణ

కేఎస్ రవికుమార్‌తో బాలకృష్ణ

బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ సినిమా కొంత ఆలస్యం కానున్నది. ఈ కారణంతోనే కేఎస్ రవికుమార్ చెప్పిన కథను ముందుకు తీసుకొచ్చారు. కేఎస్ రవికుమార్‌తో బాలయ్య జై సింహా అనే చిత్రంలో నటించారనే సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. కేఎస్ రవికుమార్‌తో సినిమా తర్వాత బోయపాటి మూవీ పట్టాలెక్కడం ఖాయమైంది.

 20 కేజీలు తగ్గేందుకు బాలయ్య

20 కేజీలు తగ్గేందుకు బాలయ్య

బోయపాటి సినిమా కోసం బాలయ్య ఓ సాహసం చేయబోతున్నాడు. బోయపాటి మూవీ కోసం బాలకృష్ణ ఏకంగా 20 కేజీల బరువు తగ్గనున్నారట. రానున్న మూడు, నాలుగు నెలల్లో బాలయ్య సుమారు 20 కేజీలు తగ్గే అవకాశం ఉంది. ఇందుకోసం బాలయ్య ప్రత్యేకంగా బరువు తగ్గే పద్ధతిని, డైట్‌ను ఫాలో కాబోతున్నారనట. బాలయ్య నాజుక్కుగా ఎలా ఉంటారనే విషయం ఫ్యాన్స్‌లో ఆసక్తిరేపుతున్నది. ఈ మూడు నెలల్లోనే కేఎస్ రవికుమార్ సినిమాను పూర్తి చేస్తారట.

మేలో బాలయ్య సినిమా సెట్స్‌పైకి

మేలో బాలయ్య సినిమా సెట్స్‌పైకి

బాలకృష్ణ, కేఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో మూవీ మే నెలలో ప్రారంభం కానున్నది. రామోజీ ఫిలిం సిటీలో జరిగే కార్యక్రమంతో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది. ఈ సినిమాలో బాలయ్య డబుల్ రోల్‌లో కనిపిస్తారట. ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ పాత్రలో కనిపిస్తారు. హీరోయిన్ ఎంపిక ఇంకా పూర్తి కాలేదు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X