బాలయ్యదీ లీక్ అయ్యింది?

By Staff

Balakrishna
బాలకృష్ణ తాజా చిత్రం మిత్రుడు సినిమాలోని ఓ పాట లీక్ అయిందని తెలుస్తోంది. మణిశర్మ స్వరపరిచిన గోపాల బాల బాలకృష్ణా అంటూ వాయించైవా మురళని అనే పాట ఇంటర్నెట్ లో అనధికారికంగా లభ్యమవుతోందని సమాచారం. ఇలా ఆడియో రిలీజ్ కి ముందే పాట లీక్ అవటంపై బాలకృష్ణ చాలా సీరియస్ గా ఉన్నారు. ఆయన సినీ కెరీర్ లో ఇదే మొదటిసారి ఇలా జరగటం. రాజమౌళి శిష్యుడు మహదేవ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై సినీ వర్గాల్లోనే కాక అబిమానుల్లోనూ మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఇంతకు ముందు జల్సా, మగధీర, శివాజీ చిత్రాలు ఈ లీక్ సమస్యను ఎదుర్కొన్నాయి.

తమిళంలోనూ విజయ్ సినిమా లీక్ అయి పెద్ద తలనొప్పిగా మారి కేసులు పెట్టుకునే దాకా వెళ్ళింది. అయితే ముందు లీకేజి అయినదానికన్నా ఎవరా ఇంటిదొంగ అన్న దానిపై దృష్టిపెట్టమని బాలయ్య సూచన చేసారని చెప్తున్నారు. ఎందుకంటే కీలకసన్నివేశాలు నెట్ లో ముందే వస్తే..ఎంతో కష్టపడి చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని అంటున్నారు. ఇక రానున్న రోజుల్లో రిలీజయ్యాక పైరసీ పెరగకుండా పైరసీ సెల్ ఉన్నట్లే షూటింగ్ లో ఉండగా సీన్స్ బయిటకు వెళ్ళకుండా ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తుందేమో అంటున్నారు ఈ సంఘటనలు దగ్గర నుండి గమనిస్తున్న ఓ సీనియర్ నిట్టూరుస్తూ. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రియమణి కనిపించనుంది. ఈ చిత్రానికి కథ విజయేంద్రప్రసాద్ అందిస్తున్నారు. ప్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X