ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈనెల 16న జరగాల్సిన బాలయ్య యాత్ర రద్దయింది. ముఖ్యమంత్రి అవినీతి వ్యవహారాలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినందున పర్యటన వాయిదా వేసినట్టు టిడిపి నేత కంభంపాటి రామ్మోహనరావు తెలిపారు. 18న మహాకూటమి ఆధ్వర్యంలో ఢిల్లీ పర్యటించి రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి వినతిపత్రం అందజేయాలని నిర్ణయించారు. కాగా వెలుగుబంటి సూర్యనారాయణ కేసులో ఇప్పటి వరకు చార్జి షీటు దాఖలు చేయనందునే ఆయనకు బెయిలు లభించిందని టిడిపి న్యాయవిభాగం అధ్యుక్షుడు కనకమేడల రవీంద్ర కుమార్ అభిప్రాయపడ్డారు. కేంద్రం జోక్యం చేసుకుని చార్జిషీటు దాఖలయ్యేట్టు చర్యలు తీసుకోవాలని కోరారు.
Story first published: Saturday, February 14, 2009, 18:27 [IST]