బాలకృష్ణ విసుక్కోలేదు..హ్యాపీ

నందమూరి బాలకృష్ణ హీరోగా సత్యదేవను దర్శకునిగా పరిచయం చేస్తూ ఎస్.ఎల్.వి.. సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న భారీ చిత్రం షూటింగ్ ఇటీవల తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం, మారేడుమిల్లి తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో జరిగింది. అటు రాజకీయంగా, ఇటు సినిమాపరంగా వరుస విజయాలు సాధిస్తూ ఊపుమీదున్న బాలకృష్ణ ఎంతో ఉత్సాహంతో ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత రమణారావు మాట్లాడుతున్నారు.
అలాగే ...నిజానికి ఏజెన్సీలో భారీ వర్షాలు కురవడంతో మా షూటింగ్‌కు అంతరాయం కలిగింది. ఏడు రోజులు అనుకున్న షెడ్యూల్‌కు పదమూడు రోజులు పట్టింది. అయినా మా హీరోగారి సహకారంతో అనుకున్న వర్క్‌ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రీకరించాం. ముఖ్యంగా రామ్‌లక్ష్మణ్ సారథ్యంలో చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్‌లో బాలకృష్ణగారు చేసిన సాహసాలు ఆయన అభిమానుల్ని అలరిస్తాయి.
ఇక డూప్‌లేకుండా రిస్కీ షాట్స్, రోప్ షాట్స్ ఆయన చేస్తుంటే యూనిట్ సభ్యులే కాదు షూటింగ్ చూడటానికి వచ్చిన భారీ జనం కరతాళధ్వనులతో ఆయన్ని అభినందించారు. అంతేకాదు ఆయనకి రాజమండ్రిలో స్టార్ హోటల్‌లో మకాం ఏర్పాటు చేసినప్పటికీ అక్కడికి వెళ్లకుండా ఏజెన్సీ ప్రాంతంలోనే ఉండిపోయారు. ఈ చిత్రం షూటింగ్ బుధవారం నుంచి హైదరాబాద్‌లో జరుగుతుందని అని చెప్పారు.
బాలకృష్ణ గతంలో నటించిన 'సీతారామకల్యాణం', 'బొబ్బిలిసింహం', 'తల్లిదండ్రులు' చిత్రాల షూటింగ్స్ కూడా ఇదే ఏజెన్సీ ప్రాంతంలో జరిగాయి. ఆ హిట్ సెంటిమెంట్ తమ సినిమాకి కూడా వర్కవుట్ అవుతుందనే ధీమా యూనిట్ సభ్యుల్లో ఉంది. బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఫొటోగ్రఫీ: వెంకటప్రసాద్. కళ: రవీందర్.


Click it and Unblock the Notifications











